Turkey Earth Quake : టర్కీ, సిరియా దేశాల్లో భారీ భూకంపం సంభవించింది.
ఈ ప్రకృతి విలయ తాండవంలో ఇప్పటి వరకు 90 మందికి పైగా మృతిచెందగా.. వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
దక్షిణ టర్కీలోని నుర్దగీకి 23కిలో మీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది.
రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 7.8గా నమోదైంది.
సోమవారం తెల్లవారు జామున 4.17గంటల సమయంలో ఈ భూప్రకంపనలు సంభవించినట్లు సమాచారం అందుతుంది.
టర్కీ లోని గాజియాన్‌తెప్ ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
భూకంపం సంభవించిన పావుగంట తర్వాత 6.7తీవ్రతతో మరోసారి శక్తిమంతమైన ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
స్థానిక మీడియా వివరాల ప్రకారం.. భూకంపం తీవ్రతకు పలు ప్రాంతాల్లో అపార్ట్ మెంట్లు, భవనాలు కూలిపోయాయి. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
భూకంపం తీవ్రతకు టర్కీ, సిరియాలో పెనునష్టం వాటిల్లినట్లు వార్తలు వచ్చాయి.
భారీ భూకంపం తర్వాత ఆ ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించినట్లు టర్కీ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.
లెబనాన్, సిరియాలో కూడా భూకంపం సంభవించింది. ఉత్తర నగరం అలెప్పో, సెంట్రల్ సిటీ హమాలో కొన్ని భవనాలు కుప్పకూలినట్లు సిరియా ప్రభుత్వ మీడియా పేర్కొంది.
ప్రాణనష్టంపై ఎలాంటి సమాచారం లేదు. బీరూట్, డమాస్కస్‌లలో అపార్ట్‌మెంట్లు, భవనాలు కంపించడంతో స్థానిక ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు.
టర్కీ భౌగోళిక స్థానం కారణంగా అక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.
గత పదమూడేళ్లుగా టర్కీలో సంభవించిన భూకంపాల కారణంగా వందలాది మంది మరణించినట్లు అధికారిక లెక్కలు ఉన్నాయి.
ఇప్పటివరకు టర్కీలో 53, సిరియాలో 42 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయినట్లు తెలిపారు. దీన్ని బట్టి చూస్తే మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశమున్నట్లు చెబుతున్నారు.
ముఖ్యంగా టర్కీలోని మలట్యా, ఉర్ఫా, ఒస్మానియో, దియర్‌బకీర్ ప్రాంతాల్లో భూకంప ప్రభావం అధికంగా ఉంది.
సిరాయాలో అలెప్పో, హమా, లటాకియాలో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి.
భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇళ్లు నేలమట్టమైన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
టర్కీలోని దియర్‌బకీర్ ప్రాంతంలో ఓ భవనం పేకమేడలా కుప్పకూలిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక హతయ్ ప్రాంతంలో భూకంప తీవ్రతకు సహజవాయువు గ్యాస్ పైప్‌లైను పేలి భారీగా మంటలు చెలరేగాయి.
కుప్పకొలిన ఇళ్ల కింద ఇరుక్కుపోయిన వారిని చూస్తుంటే హృదయం ద్రవించుకుపోతుంది.
పోలీసులు. అధికారులు వారిని సురక్షితంగా బయటికి తీసేందుకు చర్యలు చేపడుతున్నారు.
గత ఏడాది కూడా ఎంతమంది చనిపోయారంటే..
గత ఏడాది 2020 జనవరిలో ఇలాజిగ్ ప్రాంతంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించి 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
అదే ఏడాది అక్టోబరులో 7.0 తీవ్రతతో సంభవించిన భూకంప విలయంలో 114 మంది మృత్యువాతపడ్డారు.
ఇక, 1999లో టర్కీ చరిత్రలో అత్యంత భీకర ప్రకృతి బీభత్సాన్ని చవిచూసింది.
ఆ ఏడాది 7.4తీవ్రతతో భూకంపం సంభించి 17వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
ఒక్క ఇస్తాంబుల్‌లోనే 1000 మంది మరణించారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/