Site icon Prime9

Sudan: సూడాన్ రాజధాని ఖార్టూమ్‌ పై డ్రోన్ దాడి.. 30 మంది మృతి

Sudan

Sudan

Sudan: సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లో ఆదివారం బహిరంగ మార్కెట్‌పై డ్రోన్ దాడిలో కనీసం 30 మంది మృతిచెందారు.  గత కొద్దికాలంగా దేశంపై నియంత్రణ కోసం సైన్యం మరియు శక్తివంతమైన పారామిలిటరీ బృందం రెండూ పోరాటానికి దిగాయి. అయితే ఈ డ్రోన్ దాడి ఎవరివల్ల జరిగిందనేది తెలియలేదు.

వైమానిక దాడులు..(Sudan)

కార్టూమ్ యొక్క పరిసరాల్లో జరిగిన దాడిలో కనీసం మూడు డజన్ల మంది గాయపడ్డారని వైద్య కార్మికులు తెలిపారు. ఆసుపత్రిలోని ఓపెన్ యార్డ్‌లో మృతదేహాలను తెల్లటి షీట్‌లతో చుట్టి ఉన్న దృశ్యాలను కార్యకర్తల బృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సూడాన్ యుద్ధంలో రెండు వర్గాల విచక్షణారహితంగా షెల్లింగ్ మరియు వైమానిక దాడులకు దిగడం నెలల తరబడి జరుగుతోంది. ఇది గ్రేటర్ ఖార్టూమ్ ప్రాంతాన్ని యుద్ధభూమిగా మార్చింది. జనరల్ అబ్దెల్ ఫత్తా బుర్హాన్ నేతృత్వంలోని దేశం యొక్క సైన్యం మరియు జనరల్ మొహమ్మద్ హమ్దాన్ దగాలో నేతృత్వంలోని పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య పోరాటంతో ఏప్రిల్ నుండి సూడాన్ హింసాత్మకంగా మారింది.

ఐక్యరాజ్యసమితి ఆగస్టు గణాంకాల ప్రకారం, ఈ ఘర్షణలో 4,000 మందికి పైగా మరణించారు. అయితే వీరి సంఖ్య ఎక్కువగానే ఉంటుందని అని వైద్యులు మరియు కార్యకర్తలు అంటున్నారు. యునైటెడ్ నేషన్స్ శరణార్థ ఏజెన్సీ ప్రకారం ఈ ఘర్షణలతో తమ ప్రాంతాలనుంచి వలసోయిన వారి సంఖ్య 7.1 మిలియన్ల మందికి చేరుకోగా మరో 1.1 మిలియన్ల మంది పొరుగు దేశాలలో శరణార్థులుగా ఉన్నారు.

Exit mobile version