Prime9

Trump on Ahmedabad Plane Crash: విమాన ప్రమాదంపై ట్రంప్ కీలక ప్రకటన.. ఎలాంటి సాయం చేసేందుకైనా సిద్ధం..!

Donald Trump ready to do any help on Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ విమాన క్రాస్ ఒక భయంకరమైన ప్రమాదం అని పేర్కొన్నారు. ఈ సమయంలో భారత్‌కు ఎలాంటి సాయమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో కూలిన బోయింగ్ ఎయిర్ ఇండియా విమానం ప్రమాద సమయంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు.

 

అయితే ఈ ప్రమాదంలో 241 మంది చనిపోగా.. ఒకరు మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. ఈ మృతదేహాలకు ప్రస్తుతం డీఎన్ఏ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ విమానం నేరుగా ఓ మెడికల్ కాలేజీపై కూలడంతో అక్కడ ఉంటున్న 22 మంది వైద్యులు చనిపోయారు.

 

‘భారత్ చాలా పెద్ద, బలమైన దేశం. ఈ పరిస్థితిని భారత్ సమర్థవంతంగా ఎదుర్కోగలదు. భారత్‌కు ఎలాంటి సహాయం చేయడనికైనా సిద్ధంగా ఉన్నాం. ఇది చాలా పెద్ద ప్రమాదం. ఈ క్రాష్ ఎలా జరిగిందో తెలియడం లేదు. నేను నా ఆలోచనలు చెప్పిన. విమానం మంచిగానే ఎగురుతున్నట్లు కనిపించింది. అయితే ఇంతలోనే ఘోర ప్రమాదం జరగడం విచారకరం. ఇలాంటి క్రాష్ జరుగుతుందని ఊహించలేదు.’ అని అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదంపై ట్రంప్ అభివర్ణించారు.

 

Exit mobile version
Skip to toolbar