Site icon Prime9

Donald Trump: ట్రంప్ కీలక ప్రకటన.. భారత్‌పై ప్రతీకార సుంకాలు ఎంతంటే?

Donald Trump Announces 26 percent Discounted Reciprocal Tariff On India: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రపంచ దేశాలకు తెర పడింది. ఇందులో భాగంగానే ప్రపంచంలోని అనేక దేశాలపై అమెరికా పరస్పర టారిఫ్స్ విధించింది. అన్ని దేశాలు తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్‌లో వినియోగించుకోవచ్చని, ఇందు కోసం కనీసం 10 శాతం టారిఫ్ చెల్లించాలని ట్రంప్ స్పష్టం చేశారు. వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ రోజ్ గార్డెన్ లో జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో వివిధ దేశాలపై విధిస్తున్న టారిఫ్‌లను వెల్లడించారు.

 

చైనా, జపాన్, థాయ్ లాండ్, వియత్నాం, భారత్ తమపై అధిక టారిఫ్ విధిస్తున్న విషయాన్ని ట్రంప్ గుర్తు చేశారు. అయితే పెంచిన ఈ టారిఫ్స్ తక్షణమే అమల్లోకి వస్తాయని ట్రంప్ ప్రకటించారు. కాగా, భారత కాలమానం ప్రకారం.. అర్ధరాత్రి నుంచి 1.30 నిమిషాల నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఇతర దేశాలు విధిస్తున్న టారిఫ్‌ల్లో సగమే వేస్తున్నామని ఆయన ప్రకటించారు.

 

ఇదిలా ఉండగా, అత్యధికంగా కాంబోడియా దిగుమతులపై 49 శాతం సుంకం విధించారు. ఆ తర్వాత వియత్నాం 46 శాతం, చైనా 34 శాతం, తైవాన్ 32 శాతం, ఇండోనేషియా 32 శాతం, స్విట్జర్లాండ్ 31శాతం, భారత్ 26 శాతం, సౌత్ కొరియా 25 శాతం, ఈయూ 24 శాతం, వెనిజులా 15 శాతం, బ్రెజిల్, సింగపూర్, ఉక్రెయిన్ దేశాలపై 10 శాతం సుంకం విధించారు.

Exit mobile version
Skip to toolbar