Site icon Prime9

King Charles III: కింగ్ చార్లెస్ పై కోడిగుడ్లు విసిరిన వ్యక్తికి విధించిన శిక్ష ఏమిటో తెలుసా?

King Charles

King Charles

London: బ్రిటన్ రాజు చార్లెస్ మరియు క్వీన్ కన్సార్ట్ కెమిల్లా పై గుడ్లు విసిరినందుకు అరెస్టయిన వ్యక్తికి గుడ్లు తినకుండా శిక్ష విధించారు. 23 ఏళ్ల పాట్రిక్ థెల్వెల్, యార్క్ విశ్వవిద్యాలయం విద్యార్థి. గత వారం యార్క్‌షైర్ పర్యటన సందర్భంగా కింగ్ చార్లెస్‌ పై గుడ్లు విసిరినందుకు అరెస్టు చేయబడ్డాడు. తెల్వెల్ కు శిక్షగా గుడ్లు తీసుకోకుండా నిషేధించారు.

కింగ్ చార్లెస్ మరియు క్వీన్ కన్సార్ట్ కెమిల్లా రాజు దివంగత తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి యార్క్ షైర్ నగరాన్ని సందర్శించారు. యార్క్‌లో నగర నాయకులు వారికి స్వాగతం పలుకుతుండగా వారిపై గుడ్లు విసిరారు. లార్డ్ మేయర్‌తో సహా ప్రముఖులతో కింగ్ చార్లెస్ కరచాలనం చేస్తూనే ఉండగా ఇది జరిగింది. దీనితో రాజ దంపతులు త్వరగా బయటకు వచ్చారు.

గుడ్లు విసిరిన వ్యక్తి, పాట్రిక్ థెల్‌వెల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా అతను ఈ దేశం బానిసల రక్తంతో నిర్మించబడింది అని అరవడం వినిపించింది. తెల్వెల్ విద్యార్థిగా ఉన్న విశ్వవిద్యాలయం ఈ సంఘటనతో ఆశ్చర్యపోయినట్లు తెలిపింది.

Exit mobile version