Site icon Prime9

Dell Layoffs: 6,650 మంది ఉద్యోగులకు డెల్ కంపెనీ గుడ్ బై

Dell

Dell

Dell Layoffs: టెక్ దిగ్గజం ‘డెల్’ లే ఆఫ్స్ లిస్టులో చేరింది. ప్రపంచ వ్యాప్తంగా 6,650 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్టు సంస్థ ప్రకటించింది.

పర్సనల్ కంప్యూటర్ల అమ్మకాలు తగ్గడం వల్ల ప్రస్తుత మార్కెట్ పరిస్థితి ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు డెల్ తెలిపింది.

గ్లోబల్ వర్క్ ఫోర్సులో 5 శాతం వరకు ఈ తగ్గింపులు ఉంటాయిని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ క్లర్క్ వెల్లడించారు.

 

37 శాతం పడిపోయిన డెల్ ఎగుమతులు (Dell Layoffs)

అనిశ్చిత ఆర్థిక పరిస్థితులతో ఇతర పీసీ బ్రాండ్ లాగే డెల్ కూడా మార్కెట్ లో తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది.

మార్కెట్ విశ్లేషకుల ప్రకారం గత త్రైమాసికంలో గ్లోబల్ పీసీ మార్కెట్లు 28.5 శాతం క్షీణించాయి. ప్రపంచ మాంద్యం, ద్రవ్యోల్బణం కారణంగా డెల్ అమ్మకాలు గణనీయంగా తగ్గాయి.

గత త్రైమాసికంలో డెల్ ఎగుమతులు 37 శాతం పడిపోయాయి. డెల్ ఆదాయంలో 55 శాతం పీసీల నుంచే వస్తోంది. అయితే, ఈ తొలగింపులు ఏ విభాగంలో ఉంటాయో కంపెనీ వెల్లడించలేదు.

 

పూర్తిగా తగ్గిన పీసీల డిమాండ్ (Dell Layoffs)

కోవిడ్ కారణంగా 2020లో డెల్ ఉద్యోగాల కోత విధించింది. గత నవంబర్ లోనే హెచ్ పీ కంపెనీ.. రాబోయే మూడేళ్లలో 6 వేల మందిని తొలగిస్తామని ప్రకటించింది.

అందుకు పర్సనల్ కంప్యూటర్లకు డిమాండ్ తగ్గడమే కారణం.

అదే విధంగా సిస్కో సిస్టమ్స్, ఇంటర్నేషనల్ బిజినెస్ కార్పొరేషన్ వంటివి కూడా ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

డిసెంబర్, నవంబర్‌లతో పోల్చితే టెక్ రంగంలో ఈ ఏడాది జనవరి అత్యంత దారుణమైన నెల అని టెక్ నిపుణలు అభిప్రాయపడ్డారు.

కరోనా సమయంలో చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేశారు. దీంతో పర్సనల్ కంప్యూటర్లకు గిరాకీ బాగా పెరిగింది.

కానీ వర్స్ ఫ్రమ్ హొమ్ నుంచి ఉద్యోగులు మళ్లీ ఆఫీసులకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో పీసీలకు డిమాండ్ పడిపోయింది.

మరో వైపు పీసీలకు కీలక కేంద్రం అయిన చైనాలో కోవిడ్ ఆంక్షలు విక్రయాలపై ప్రభావం చూపాయి.

ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా కార్పొరేట్ సంస్థలు వేలల్లో ఉద్యోగుల కోత విధిస్తున్నాయి.

ఇప్పటికే దిగ్గజ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ట్విటర్.. లు చాలా మందిని ఇంటికి పంపించాయి.

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar