Site icon Prime9

Turkey-Syria earthquake: టర్కీ-సిరియా భూకంపంలో 15 వేలు దాటిన మృతుల సంఖ్య.. సహాయక చర్యలపై అసంతృప్తి

Turkey-Syria earthquake

Turkey-Syria earthquake

Turkey-Syria earthquake: సోమవారం నాటి భూకంపం కారణంగా ఒక్క తుర్కియేలోనే 12,391 మంది మరణించగా.. సిరియాలో కనీసం 2,992 మంది బలయ్యారు.

దీనితో మొత్తం మరణాల సంఖ్య 15,383కు చేరింది. శిథిలాల కింద ఇంకా లక్షలాది మంది చిక్కుకుపోయారు

వారి సంఖ్య కచ్చితంగా తెలియనప్పటికీ.. పరిస్థితి మాత్రం అత్యంత విషమంగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

సమయం గడుస్తున్న కొద్దీ మరణాల సంఖ్య ఇంకా పెరగొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక బలగాలు కాలంతో పోటీపడి సహాయక చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ..

వరుసగా వస్తున్న ప్రకంపనలు, వాతావరణ పరిస్థితులు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి.

భవనశిధిలాల కింద చిక్కుకుపోయిన వందలాది మంది ప్రజలు..

భూకంపం ధాటికి ఎక్కువగా నష్టపోయింది తుర్కియేనే. దాదాపు 10 ప్రావిన్స్‌లు ఇప్పుడు నామరూపాల్లేకుండా మారిపోయాయి.

ఒక్కో భవన శిథిలాల కింద 400 నుంచి 500 మంది చిక్కుకుపోగా వారిని కాపాడేందుకు కనీసం 10 మంది సహాయక సిబ్బంది కూడా అందుబాటులో లేరు.

శిథిలాలను తొలగించడానికి సరైన యంత్రాలు కూడా లేకపోవడంతో తుర్కియే అధ్యక్షుడు రెసెస్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌

ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

భూకంప సహాయక చర్యలపై  అసంతృప్తి..

ఈ నేపథ్యంలో నిన్న ఆయన భూకంప బాధితుల కోసం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలను సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహాయక చర్యల్లో లోపాలు ఉన్నాయని అంగీకరించారు.

అయితే ఈ ఘోర విపత్తును ముందే ఊహించినా సిద్ధపడటం మాత్రం సాధ్యం కాదన్నారు.

అవును. కొన్ని లోపాలున్నాయి. పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో మనందరికీ కన్పిస్తూనే ఉంది.

ఇలాంటి విపత్తుకు సిద్ధంగా ఉండటం అనేది ఎవరికీ సాధ్యం అయ్యే పని కాదు అని ఆయన అన్నారు.

ప్రతికూలవాతావరణంతో అల్లాడుతున్న ప్రజలు..(Turkey-Syria earthquake:)

ఇక తుర్కియేలో గాజియాంటెప్ ప్రాంతంలోగురువారం ఉదయం వాతావరణ విషయానికి వస్తే మైనస్‌ 5 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది.

ఎముకలు కొరికే చలి అయినా వేలాది కుటుంబాలు తమ కుటుంబాలతో కలిసి రాత్రంతా కార్లలో జాగారణ చేయాల్సి వచ్చింది.

తాత్కాలిక గుడారాల్లో కాలం వెళ్లదీయాల్సి వచ్చింది. తిరిగి తమ ఇళ్లకు వెళ్లాలంటే భయంతో వణికిపోతున్నారు.

తల్లిదండ్రులు తమ పిల్లలను బ్లాంకెట్స్‌ కప్పి భూకంపానికి కేంద్ర బింధువు ప్రాంతానికి తరలివస్తున్నారు.

టెంట్లలో ఉండకుండా బయటికి ఎందుకు వస్తున్నారు అని ప్రశ్నిస్తే టెంట్లలో ఉంటే చాలి ఎక్కువగా ఉంటోందని

ఇలా బయట తిరిగితేనే కాస్తా వెచ్చగా ఉంటుందని వారు సమాధానమిస్తున్నారు.

రెస్యూ వర్కర్స్‌ బుధవారం రాత్రంతా పనిచేస్తునే ఉన్నారు. వారంతా శిధిలాలను తొలగించే పనిలో పడ్డారు.

భారీ భూకంపానికి ప్రతి సెకనుకు ఒకరు చనిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి రెస్యూ టీం వెళ్లలేదు.

భూకంపం నుంచి బయటపడ్డ వారు కూడా ఏకాంతంతగా బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు.

అయితే భూకంపం ధాటికి కొన్నిభవనాలు కూలకపోయినా బాగా దెబ్బతిన్నాయి.

శిధిలాల కింద చాలా మంది ఉంటారని సిరియాలో రెబెల్స్‌ అదుపులో ఉన్న జిన్‌డయారిస్‌

ప్రాంతానికి చెందిన హసన్‌ అనే వ్యక్తి చెప్పాడు.

ప్రతి భవనం కింద పెద్ద సంఖ్యలో చిక్కుకుపోయి ఉండవచ్చునని చెబుతున్నాడు.

కానీ వారిని వెలికి తీయడానికి కేవలం 10 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారని, యంత్రాలు లేవని ఆయన అన్నారు.

విద్యుత, ఇంధనం, మంచినీటి సమస్యలతో సతమతమవుతున్న సిరియా..

భూకంపానికి సిరియా కూడా బాగా దెబ్బతింది. యూరోపియన్‌ యూనియన్‌ను సాయం కోసం దీనంగా అడుగుతోంది.

సిరియాకు సాయం అందించాలంటే కఠినమైన ఆంక్షలు అమల్లో ఉన్నాయి.

కాగా దశాబ్దం పాటు సిరియాలో అంతర్యుద్ధంతె ఆస్పత్రులు, ఆర్థిక వ్యవస్థ కుదేలైంది.

ప్రస్తుతం విద్యుత్‌, ఇంధనం, మంచి నీటి కొరతతో సతమతమవుతోంది.

కాగా యూరోపియన్‌ యూనియన్‌ సభ్య దేశాలను వెంటనే సిరియాకు మందులతో పాటు

ఆహారం ఇతర వస్తువులను పంపించాల్సింది ఈయు కోరింది.

https://youtube.com/watch?v=k_rYx-lDXfI&feature=shares

Exit mobile version