Site icon Prime9

China Woman Fortune: పెంపుడు జంతువులకు రూ.23 కోట్ల ఆస్తిని రాసిన చైనా మహిళ

China Woman

China Woman

China Woman Fortune: చైనాలోని ఒక వృద్ధ మహిళ తన $2.8 మిలియన్ల సంపదను తన పిల్లులు. కుక్కలకు ఇవ్వాలని నిర్ణయించుకుంది. షాంఘైకి చెందిన సియు కొన్ని సంవత్సరాల క్రితం వీలునామా తన ముగ్గురు పిల్లలకు తన ఆస్తిని ఇస్తూ వీలునామా రాసింది.అయితే తాజాగా ఆమె మనసు మార్చుకుంది. సియు అనారోగ్యం పాలైనప్పుడు పిల్లలు ఆమెను పట్టించుకోలేదు కాబట్టి ఆమె వీలునామాను సవరించింది. తన పెంపుడు జంతువులు మాత్రమే తన వద్ద ఉన్నాయని పేర్కొంది. తాను చనిపోయిన తరువాత వాటి సంరక్షణ కోసం తన సంపద మొత్తాన్ని ఉపయోగించాలని వీలునామా రాసింది.

వెటర్నరీ క్లినిక్కుకు బాధ్యతలు..(China Woman Fortune)

అంతేకాదు స్థానిక వెటర్నరీ క్లినిక్ ను ఆమె వారసత్వం యొక్క నిర్వాహకులుగా నియమించింది. ఈ క్లినిక్ జంతువుల సంరక్షణకు బాధ్యత వహిస్తుంది. బీజింగ్‌లోని చైనా విల్ రిజిస్ట్రేషన్ సెంటర్ హెడ్‌క్వార్టర్స్‌కు చెందిన అధికారి చెన్ కై మాట్లాడుతూ, లియు తన డబ్బు మొత్తాన్ని తన కుక్కలకు ఇవ్వాలని ప్లాన్ చేసినప్పటికీ, అది దేశంలో అనుమతించబడదని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. లియు యొక్క పెంపుడు జంతువులను సరిగ్గా చూసుకోవడానికి వెటర్నరీ క్లినిక్‌ని పర్యవేక్షించడానికి ఆమె విశ్వసించే వ్యక్తిని నియమించమని మేము ఆమెకు సలహా ఇచ్చామని చెప్పారు.

చైనా విల్ రిజిస్ట్రేషన్ సెంటర్ యొక్క తూర్పు చైనా బ్రాంచ్ ప్రతినిధి లియు తన ఫైనల్ డ్రాఫ్ట్ చేయడానికి ముందు తన డబ్బు మొత్తాన్ని పెంపుడు జంతువుల క్లినిక్‌కి అప్పగించడం వల్ల కలిగే ప్రమాదాల గురించి కూడా హెచ్చరించామని చెప్పారు.వృద్ధురాలి కథనం చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చర్చనీయాంశమైంది. ఈ ఆలోచనకు పలువురు మద్దతు తెలుపగా, మరికొందరు అవాక్కయ్యారు.

Exit mobile version