Site icon Prime9

China: చైనాలోని పాఠశాల వసతి గృహంలో అగ్నిప్రమాదం.. 13 మంది మృతి..

China

China

China: సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని పాఠశాల వసతి గృహంలో మంటలు చెలరేగడంతో కనీసం 13 మంది మరణించినట్లు అధికారిక మీడియా శనివారం నివేదించింది.హెనాన్‌లోని యన్‌షాన్‌పు గ్రామంలోని యింగ్‌కాయ్ పాఠశాలలో మంటలు వ్యాపించాయని శుక్రవారం రాత్రి 11 గంటలకు స్థానిక అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించినట్లు పీపుల్స్ డైలీ నివేదించింది.

భద్రతా ప్రమాణాల లోపం..(China)

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది రాత్రి 11.38 గంటలకు మంటలను ఆర్పివేశారు.ఈ ఘటనలో 13 మంది మరణించగా, ఒక వ్యక్తి గాయపడినట్లు ధృవీకరించారు.అగ్ని ప్రమాదానికి గల కారణాలపై స్థానిక అధికారులు ఆరా తీస్తున్నారు.చైనాలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, సరిగా అమలు చేయకపోవడం వల్ల మంటలు, ఇతర ప్రాణాంతక ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేసిన గంటలోపే అది ఆపివేయబడింది. ఈ బోర్డింగ్ పాఠశాల ప్రాథమిక తరగతుల విద్యార్దుల కోసం ఉంది. దీనికి అనుబంధంగా ఉన్న కిండర్ గార్టెన్ కూడా ఉంది. గత నవంబర్‌లో, షాంగ్సీ ప్రావిన్స్‌లోని లులియాంగ్ సిటీలోని కార్యాలయ భవనంలో పెద్ద అగ్నిప్రమాదం సంభవించి 26 మంది మరణించారు.గత ఏప్రిల్‌లో బీజింగ్‌లోని ఒక ఆసుపత్రి అగ్నిప్రమాదంలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దీని విచారణ కోసం 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version