Site icon Prime9

China on Modi : మోదీ వ్యాఖ్యలు అభినందనీయం.. ప్రశంసించిన చైనా

China on Modi

China on Modi

China on Modi : భారత్, చైనా దేశాల మధ్య మంచి ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ చెప్పడంపై చైనా స్పందించింది. మోదీ సానుకూల వ్యాఖ్యలు అభినందనీయమని, పరస్పర సహకారం రెండు దేశాల విజయానికి దోహదపడుతుందని పేర్కొంది. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన లెక్స్ ఫ్రిడ్‌మన్ పాడ్‌కాస్ట్‌లో భారత్, చైనా సంబంధాలపై ప్రధాని మోదీ సానుకూలంగా మాట్లాడిన సందర్భంగా చైనా స్పందించింది.

 

 

గతేడాది అక్టోబర్‌ నెలలో రష్యాలోని కజాన్‌లో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ భేటీ అయ్యారని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ పేర్కొన్నారు. ఈ భేటీలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటంతోపాటు వ్యూహాత్మక మార్గదర్శకత్వానికి దోహదం చేసిందని ఆమె చెప్పారు. శతాబ్దాల చర్చల చరిత్రలో ఇరుదేశాలు స్నేహపూర్వక సంప్రదింపులు కొనసాగించాయని తెలిపారు. ఒకదాన్ని నుంచి మరొకటి నేర్చుకుంటూ మానవ నాగరికత, పురోగతికి కృషి చేశాయని కొనియాడారు. అభివృద్ధి చెందుతున్న రెండు అతిపెద్ద దేశాలుగా ఉన్న చైనా, భారత్ పరస్పరం సహకారంతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతల ఉమ్మడి లక్ష్యాలకు అనుగుణంగా ఇండియాతో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉందన్న విషయాన్ని ఆమె మరోసారి గుర్తుచేశారు.

 

 

ఫ్రిడ్‌మన్ పాడ్‌కాస్ట్‌లో దేశ ప్రధాని మోదీ మాట్లాడారు. ఇండియా, చైనా దేశాల మధ్య వైరుద్ధ్యాల పరిష్కారానికి చర్చలకే మొగ్గు చూపుతానని పేర్కొన్న సంగతి తెలిసిందే. వాస్తవాధీన రేఖ వెంట 2020 ముందునాటి పరిస్థితులను నెలకొల్పేందుకు ఇరుదేశాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. రెండు దేశాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని కోరుకుంటున్నామని, అది ఘర్షణకు దారి తీయరాదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

Exit mobile version
Skip to toolbar