Site icon Prime9

Muhammad Yunus: యూనస్‌ కొనసాగుతారు.. రాజీనామా వార్తలపై స్పందించిన సలహాదారు వహీదుద్దీన్ మహమూద్

Muhammad Yunus

Muhammad Yunus

Advisor responds to news of Yunus’ Resignation: బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్‌ యూనస్‌ తన పదవికి రాజీనామాకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై తాజాగా ఆయన మంత్రివర్గ సలహాదారు వహీదుద్దీన్ మహమూద్ స్పందించారు. అవన్నీ అసత్య ప్రచారాలు అని కొట్టిపడేశారు. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యూనస్‌ కొనసాగుతారని స్పష్టం చేశారు. బంగ్లాలో నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితులకు భయపడి రాజీనామా చేస్తానని చెప్పలేదన్నారు. యూనస్‌ సర్కారుకు కేటాయించిన బాధ్యతలు నిర్వర్తించడంలో అనేక అడ్డంకులు ఎదుర్కొంటున్నామని, వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.

 

మంత్రులు, ఇతర అధికారులతో సమావేశం..

యూనస్‌ 19 మంది సలహాదారులు, మంత్రులు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం వహీదుద్దీన్ వ్యాఖ్యలు చేశారు. తమ తాత్కాలిక ప్రభుత్వానికి అప్పగించిన బాధ్యత ఎంతో ముఖ్యమైనదని, దాన్ని తాము మధ్యలో వదులుకోలేమని చెప్పారు. ప్రభుత్వ సలహాదారులు ఎక్కడికి వెళ్లడంలేదని స్పష్టం చేశారు. దేశ భద్రత, ప్రజల డిమాండ్లను తీర్చేందుకు ప్రభుత్వానికి అధికారులు సహకరించాలని యూనస్‌ చర్చల్లో కోరారు.

 

శుక్రవారం నేషనల్‌ సిటిజన్‌ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్‌ నహిద్‌ ఇస్లాం, యూనస్‌ రాజీనామా గురించి ఓ మీడియాతో మాట్లాడారు. యూనస్‌ రాజీనామా గురించి వచ్చిన వార్తలు తాను విన్నానని చెప్పారు. దానిపై చర్చించేందుకు ఆయన్ను కలిసినట్లు పేర్కొన్నారు. రాజీనామా గురించే ఆలోచిస్తున్నానని యూనస్‌ తనతో చెప్పారన్నారు. దేశంలోని రాజకీయ పార్టీలు అన్నీ ఐక్యంగా లేకపోతే పనిచేయలేనని యూనస్ వెల్లడించినట్లు పేర్కొన్నారు. దేశ భద్రత, భవిష్యత్ కోసం బలంగా ఉండాలని ఆయనకు చెప్పానని తెలిపారు. పార్టీలన్నీ ఐక్యంగా ఉండి ఆయనకు సహకరిస్తాయని ఆశిస్తున్నానని, పార్టీలకు ఆయనపై విశ్వసనీయత లేనప్పుడు యూనస్‌ పదవిలో ఎలా కొనసాగుతారని నహిద్‌ పేర్కొన్నారు. దీంతో ఆయన రాజీనామా చేయనున్నారనే వార్తలు ఊపందుకున్నాయి.

Exit mobile version
Skip to toolbar