Site icon Prime9

Bangladesh: బంగ్లాదేశ్‌లో చెరువులో పడిన బస్సు.. 17 మంది మృతి.. 35 మందికి గాయాలు

Bangladesh

Bangladesh

Bangladesh: బంగ్లాదేశ్‌లోని ఛత్రకాండ ప్రాంతంలో శనివారం బస్సు రోడ్డు పక్కన ఉన్న చెరువులో పడిపోవడంతో 17 మంది మరణించగా పలువురు గాయపడ్డారు.బాధితుల్లో ఏడుగురు మైనర్లు, ఐదుగురు మహిళలు ఉన్నారు.ఆటో కు సైడ్ ఇస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల.. (Bangladesh)

భండారియా ఉపజిల్లా నుండి పిరోజ్‌పూర్‌కు వెడుతున్న బస్సు స్థానిక యూనియన్ పరిషత్ కార్యాలయం సమీపంలో ఉదయం 9.55 గంటలకు ఆటో రిక్షాకు సైడ్ ఇస్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో చెరువులో పడిపోయిందని ఝలకతి సదర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ అధికారి నసీర్ ఉద్దీన్ తెలిపారు.ఈ ప్రమాదంలో 35 మంది ప్రయాణికులు గాయపడగా, వారిని జలకతి జిల్లా ఆసుపత్రికి తరలించారు.స్థానిక అగ్నిమాపక సిబ్బంది బస్సును చెరువునుంచి వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. రెస్క్యూ కార్మికులు సంఘటనా స్థలం నుండి 13 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు, మరో నలుగురు ఆసుపత్రిలో మరణించారు. గాయపడిన వారిలో ఐదుగురిని బరిషల్‌లోని షేర్-ఎ-బంగ్లా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. మిగిలిన వారిని స్థానిక ఆరోగ్య కేంద్రాల్లో చేర్చారు.ఈ సంఘటన తర్వాత ఖుల్నా-జలకతి రహదారిపై ట్రాఫిక్ మూసివేయబడింది. దీనితో రెండువైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి.

Exit mobile version