Burkina Faso: పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో గుర్తు తెలియని జిహాదీలు జరిపిన ఆకస్మిక దాడిలో 20 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు.దేశంలోని మధ్య-తూర్పు ప్రాంతంలోని టోగోలీస్ సరిహద్దు సమీపంలో ఈ దాడి జరిగింది. మరణించిన 20 మందిలో ఎక్కువ మంది వ్యాపారులేనని భద్రతా వర్గాలు తెలిపాయి.
ఆల్ ఖైదా, ఇస్లామిక్ గ్రూపులు..( Burkina Faso)
ఉగ్రవాద సంస్థలైన అల్ ఖైదా మరియు ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధం ఉన్న ఇస్లామిక్ గ్రూపులు ఈ ప్రాంతం లో ఉన్నాయి.అయితే ఈ దాడికి పాల్పడింది ఏ గ్రూపు అనే దానిపై స్పష్టత రాలేదు.ఏప్రిల్‌లో, ఇదే రకమయిన దాడిలో నైజర్ సరిహద్దుకు సమీపంలోని సహెల్ ప్రాంతంలోని కౌరకౌ మరియు టోండోబి గ్రామాలలో 44 మంది మరణించారు.బుర్కినా ఫాసో గత సంవత్సరం రెండు తిరుగుబాట్లు చూసిన తర్వాత హింసాత్మక సంఘటనలతో అల్లాడుతోంది. ఇది ఎనిమిదేళ్ల క్రితం 2015లో పొరుగు దేశమైన మాలి నుండి వ్యాపించిన జిహాదీ తిరుగుబాటుతో పోరాడుతోంది,
నివేదికల ప్రకారం, హింస 16,000 మందికి పైగా మరణాలకి దారితీసింది.రెండు మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.