Site icon Prime9

Buckingham Palace: రాజు పట్టాభిషేకం వేళ లండన్ లో తీవ్ర కలకలం

Buckingham Palace

Buckingham Palace

Buckingham Palace: బ్రిటన్ రాజు ఛార్లెస్ -3 పట్టాభిషేకం మరో మూడు రోజుల్లో జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. పట్టాభిషేకానికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ప్రముఖులకు ఆహ్వానం పంపింది బకింగ్ హమ్ ప్యాలెస్. మే 6 న జరుగనున్న ఈ కార్యక్రమానికి సుమారు 100 మిలియన్ పౌండ్లు..( అంటే మన కరెన్సీలో రూ. 1020 కోట్లు) ఖర్చుపెడుతున్నట్టు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తాన్ని బ్రిటన్ ప్రభుత్వమే చెల్లిస్తుంది. రాజకుటుంబీకుల వివాహాలను మాత్రం సొంత ఖర్చులతో చేసుకున్నా.. పట్టాభిషేకాన్ని మాత్రం అధికార కార్యక్రమంగా ప్రభుత్వ ఖర్చుతో నిర్వహిస్తున్నారు.

 

ప్యాలెస్ లోకి మందుగుండు విసిరిన వ్యక్తి(Buckingham Palace)

అయితే, ఓ పక్క పట్టాభిషేకానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతుండగా.. లండన్ బకింగ్ హమ్ ప్యాలెస్ దగ్గర సెక్యూరిటీ వైఫల్యం బయటపడింది. మంగళవారం సాయంత్రం ప్యాలెస్ దగ్గరకు చేరుకున్న ఓ గుర్తుతెలియని వ్యక్తి ప్యాలెస్ గ్రౌండ్ లోకి కొన్ని వస్తువులను విసిరాడు. వాటిలో తుపాకీ మందుగుండు కూడా ఉన్నట్టు సమాచారం.

పట్టాభిషేకానికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల అధినేతలు, వివిధ రంగాల ప్రముఖులు హాజరు అవుతున్నారు. ఈ నేపథ్యంలో లండన్ లో హై లెవల్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. కానీ , అంత సెక్యూరిటీ మధ్య ఈ ఘటన చోటు చేసుకోవడం విస్మయానికి గురి చేస్తోంది. భారీ భద్రతను దాటుకుని ఓ వ్యక్తి గేట్‌ వద్దకు చేరుకోవడం.. తన బ్యాగులో ఉన్న వస్తువులను ప్యాలెస్‌ వైపు విసరడం ప్రారంభించాడు. దీంతో లవి ప్యాలెస్‌ గ్రౌండ్‌లో పడ్డాయి. అయితే, వెంటనే గుర్తించిన సెక్యూరిటీ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సదరు వ్యక్తి ని తనిఖీ చేయగా బ్యాగులో ఓ ఆయుధాన్ని కూడా పోలీసులు గుర్తించారు. కాల్పులు లాంటివి చోటు చేసుకోకపోవడంతో అధికారులు ఊపరి పీల్చుకున్నారు. అయితే, ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు వస్తువులు విసిరేసాడనే దానిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు.

అంతేకాకుండా గుర్తు తెలియని దాడి చేసిన సమయంలో.. ఛార్లెస్‌, ఆయన భార్య కామిల్లా ప్యాలెస్‌లోనే ఉన్నారా? అనే విషయంపై కూడా ప్యాలెస్‌ వర్గాలు స్పందించ లేదు. తాజా ఘటనతో భద్రతా ఏర్పాట్లు మరింత కఠినతరం చేస్తున్నారు. ప్యాలెస్‌కు వెళ్లే దారులన్నీ ఒకటికి రెండు సార్లు జల్లెడ పడుతున్నారు. ప్యాలెస్ సమీపంలోని కొన్ని మాల్స్‌ను తాత్కాలికంగా మూసి వేయించారు.

 

70 ఏళ్ల తర్వాత

కాగా, బ్రిటన్ లో దాదాపు 70 ఏళ్ల తర్వాత మళ్లీ పట్టాభిషేక మహోత్సవం జరుగుతోంది. గత ఏడాది క్వీన్‌ ఎలిజబెత్‌-2 మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఆమె తనయుడు ఛార్లెస్‌-3 ని రాజుగా ప్రకటించింది రాజప్రసాదం. అయితే దాదాపు ఎనిమిది నెలల తర్వాత పట్టాభిషేకం జరుగుతోంది. సెంట్రల్ లండన్ మీదుగా నో ఫ్లై జోన్‌ను ప్రకటించడంతో పాటు రూఫ్‌టాప్ స్నిపర్‌, రహస్య అధికారులు, అలాగే ఎయిర్‌పోర్ట్-స్టైల్ స్కానర్స్, స్నిఫర్ డాగ్‌లతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

 

Exit mobile version