Brunei: ఆసియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పిలువబడే బ్రూనై యువరాజు అబ్దుల్ మతీన్ గురువారం ఒక ఇంటివాడయ్యాడు. అతను అనీషా రోస్నాఅనే సామాన్యురాలిని పెళ్లాడటంతో ఈ వివాహ వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది. బందర్ సెరీ బెగవాన్‌లోని బంగారు గోపురం సుల్తాన్ ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదులో ఈ వివాహం జరిగింది.
చాలాకాలంగా డేటింగ్ ..(Brunei)
గత సంవత్సరం అక్టోబర్‌లో నిశ్చితార్దానికి ముందు వీరిద్దరు చాలా సంవత్సరాలు డేటింగ్ చేసారు. వివాహ కార్యక్రమం ఆదివారం నాడు 1,788 గదుల ప్యాలెస్‌లో విలాసవంతమైన వేడుకతో ముగుస్తుంది. తరువాత భారీ ఎత్తున ఊరేగింపు జరుగుతుంది. 32 ఏళ్ల ప్రిన్స్ అబ్దుల్ మతీన్ మంచి పోలో క్రీడాకారుడు. హెలికాప్టర్ పైలట్‌గా కూడా ఉన్నాడు. అతను ఇన్‌స్టాగ్రామ్ లో 2.5 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్నాడు. మతీన్ తండ్రి, సుల్తాన్ హసనల్ బోల్కియా, $28 బిలియన్ల నికర విలువతో ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన వారిలో ఒకరిగా నిలిచారు. అనిషా రోస్నా సుల్తాన్ ప్రత్యేక సలహాదారు మనవరాలు. మీడియా నివేదికల ప్రకారం ఆమె సిల్క్ కలెక్టివ్ అనే ఫ్యాషన్ బ్రాండ్‌ను నడుపుతోంది.