Site icon Prime9

Viral Video: రిబ్బన్‌ కటింగ్‌ చేస్తుండగానే కూలిపోయిన వంతెన

bridge-drc-collapsed-during-inauguration

Congo: డెమొక్రెటిక్‌ రిపబ్లక్‌ ఆఫ్‌ కాంగో(డీర్‌సీ)లో ఒక వంతెన ప్రారంభోత్సవంలో అధికారులు ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో ఈ ఘటన వెలుగు చూసింది. కాంగోలో వర్షాకాలంలో స్థానికులు నదిని దాటేందుకు ఒక చిన్న వంతెనను నిర్మించారు. ఆ వంతెన ప్రారంభోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించారు.

పలువురు అధికారులు కూడా వచ్చారు. సరిగ్గా ఒక మహిళా అధికారి రిబ్బన్‌ కటింగ్‌ చేస్తుండగా, హఠాత్తుగా వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో అధికారులు అంతా ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ బెంబేలెత్తిపోయారు. దీంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమై అధికారులను రక్షించి సురక్షిత ప్రాంతాలకి తరలించారు. అదృష్టవశాత్తు ఎవరు కిందపడిపోలేదు. పైగా ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఐతే ఈ వంతెనను మిలియన్‌ డాలర్లు ఖర్చు పెట్టి నిర్మించడం గమనార్హం.

కానీ వంతెన నిర్మాణ నాణ్యతల్లో లోపాలు కారణంగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున్న ప్రభుత్వ వైఖరి పై దుమ్మెత్తిపోస్తున్నారు. అదీగాక ఈ వంతెనకు ముందు ఉన్న తాత్కాలిక నిర్మాణం తరచుగా కూలిపోతుంటుందని ఒక స్థానిక వార్త సంస్థ వెల్లడించింది.

Exit mobile version
Skip to toolbar