Site icon Prime9

Boycott Zara: ఇజ్రాయల్ లో బాయ్‌కాట్‌ జరా ఉద్యమం

Boycott

Boycott

Jerusalem: స్పానిష్‌ ఫ్యాషన్‌ రిటైలర్‌ జరా చిక్కుల్లో పడింది. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియం బ్రాండ్‌గా పేరు పడ్డ జరా ఫ్యాషన్‌ ప్రొడక్టులు ఇజ్రాయల్‌లో బాయ్‌కాట్‌ కు పిలుపుకు గురైంది. నిరసన కారులు ఒక అడుగు ముందుకు కేసి జరా దుస్తులను మంటల్లో వేసి తమ అక్కసు తీర్చుకుంటున్నారు. చాలా మంది అరబ్‌ ఇజ్రేలీ పౌరులు ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ దస్తులు మంటల్లో వేసిన వీడియోలు కూడా పోస్ట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఇజ్రాయల్ లో జరా ప్రాడక్టు బాయ్‌కాట్‌ ఓ ఉద్యమంగా మారిపోయింది.

ఇజ్రాయెల్‌లో జుయిష్‌ పవర్‌ పార్టీ నాయకుడు బెన్‌ గ్విర్‌, అరబ్‌లకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకు ఆయన పై సుమారు డజన్‌ కేసులు నమోదయ్యాయి. ఇజ్రాయెల్‌లో అరబ్‌ మైనారిటీలకు స్థానిక జ్యుయిష్‌లకు కొన్ని దశాబ్దాల కాలంగా పడదు. తరచూ వెస్ట్‌బ్యాంకులో గొడవలు ప్రపంచం మొత్తానికి తెలిసిందే. కాగా ఇజ్రాయెల్‌ జనాభాలో అరబ్‌ జనాభా వాటా 21 శాతంగా ఉంటుంది. అయితే ఇక్కడ జరా ప్రాంచైసీ ఓనర్‌ జోయి ష్వెబెల్కు కు బెన్‌ గ్విర్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. మంచి మిత్రులు.

నవంబర్‌ 1వ తేదీన జరిగే ఎన్నికల్లో బెన్‌ గ్విర్‌కు జోయి ష్వెబెల్కు మద్దతు పలికారు. ఆయనకు మద్దతుగా ప్రచారానికి దిగారు. ఆయన బహిరంగ సభల్లో కూడా పాల్గొన్నారు. ఇది ఇజ్రాయల్ లోని అరబ్‌లకు మింగుడుపడ్డం లేదు. జరా ప్రొడక్టు ఫ్రాంచైసీగా వ్యాపారం చేసుకోకుండా అరబ్‌ ముస్లింలంటే ద్వేషించే బెన్‌ గ్విర్‌కు మద్దతు పలకడం పట్ల మైనారిటీ అరబుల్లో ఆగ్రహం పెల్లుబుకింది. వెంటనే జరా ప్రొడక్టులను బహిష్కరించాలనే పిలుపునిచ్చారు. బాయ్‌ కాట్‌ జరా ప్రాడక్టు దావానంలా వ్యాపించింది. దీనికి తోడు అరబ్‌లు ఎక్కువగా ఉండే దక్షిణ ఇజ్రాయల్‌లోని రాహత్‌ పట్టణం మేయర్‌ ఫయాజ్‌ అబు సౌహిబాన్‌ కూడా సోషల్‌మీడియా వేదికగా వీడియోలో జరా పై విమర్శలు గుప్పించారు. జరా కంపెనీకి చెందిన ఫ్యాషన్‌ దుస్తులు కాల్చివేయాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో అరబ్‌ ముస్లింలు జరా దుస్తులను కాల్చడం మొదలుపెట్టారు.

Exit mobile version