Site icon Prime9

Blinken: అణుబాంబు ఆపే సత్తా ఆయనకే.. డొనాల్డ్ ట్రంప్‌పై విదేశాంగ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

Blinken Said Trump can negotiate to stop Iran from getting nuclear bomb: అమెరికా ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్‌పై ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణుబాంబు తయారుచేయకుండా డొనాల్డ్ ట్రంప్ చేయగలిగే సత్తా ఉందని వ్యాఖ్యానించాడు. ఈ విషయంలో ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు కొత్తగా నియామకమయ్యే అధ్యక్షుడికి బోలెడు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. టెహ్రాన్ అణ్వాయుధాన్ని డెవలప్ చేయకుండా అడ్డుకునే అవకాశం ఉందని వెల్లడించారు.

ప్రస్తుతం ఇరాన్ దేశం సైనికుల విషయంలో తీవ్ర ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ తరుణంలోనే అణ్వాయుధంపై ఆలోచించే అవకాశం ఉన్నట్లు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతకుముందు ఏడాది హామాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో ఆ దేశం తీవ్రంగా విరుచుకుపడింది. ఇందులో భాగంగానే పశ్చిమాసియాలో పలు మిత్ర దేశాలపై దాడి చేసింది.

అయితే, హెజ్‌బొల్లా గ్రూప్ అగ్ర రాజ్యాలపై దాడి చేయడంతో ఆ దేశాలు దెబ్బతిన్నాయి. ఇరాన్ దేశం హమాస్‌కు మద్దతు ఇవ్వడంతో ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. దీంతో పాటు సిరియాలో టెహ్రాన్ సన్నిహితుడు బషర్ అల్ అసద్‌పై తిరుగుబాటుదారులు వ్యతిరేకించడంతో ఆయన నిష్కమయ్యారు. ఈ నేపథ్యంలోనే అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ పలు విషయాలు చెప్పుకొచ్చారు.

Exit mobile version