Site icon Prime9

Bill Gates: మళ్లీ ప్రేమలో పడ్డ బిల్ గేట్స్.. ఓరాకిల్ మాజీ సీఈఓ భార్యతో డేటింగ్

Bill Gates

Bill Gates

Bill Gates: మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ ప్రేమలో ఉన్నాడా? అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు. పౌలా హర్డ్ (60) అనే మహిళతో ఆయన డేటింగ్ చేస్తున్నట్టు సమాచారం.

ఈ పౌలా హర్డ్ ఎవరో కాదు.. టెక్ దిగ్గజం ఒరాకిల్ మాజీ సీఈఓ మార్క్ హర్డ్ భార్య. ఏడాది నుంచి బిల్ గేట్స్ ఆమెతో రిలేషన్ షిప్ లో ఉన్నారని.. గత నెలలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్

సందర్భంగా ఈ జంట కెమెరాలకు చిక్కింది. పురుషుల ఫైనల్ల్స్ లో వీరు పక్కపక్కనే కూర్చుని మ్యాచ్ ను న చూశారని అక్కడి పత్రికలు వెల్లడించాయి.

Bill Gates Is In Love Again, Say Reports. See Who He's Dating

ఎవరీ పౌలా హర్డ్(Bill Gates)

పౌలా హర్డ్ భర్త మార్క్ హర్డ్ 2019 లో మరణించారు. క్యాన్సర్ తో సుదీర్ఘ కాలం పోరాడి మృతి చెందారు.

పౌలా, మార్క్ దంపతులకు కేథరిన్, కెల్లీ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పౌలా హర్డ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో డిగ్రీ పూర్తిచేశారు.

ప్రస్తుతం ఆమె నేషనల్ క్యాష్ రిజిస్ట్రర్ అనే టెక్ కంపెనీలో పనిచేశారు. అంతే కాకుండా ఈవెంట్ ప్లానర్ కూడా పనిచేస్తున్నారు.

సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె చాలా చురుకుగా ఉంటున్నారు

 

Paula Kalupa Bio, Family, Career, Husband, Net Worth, Measurements

2021 లో బిల్ గేట్స్ విడాకులు(Bill Gates)

దాదాపు 30 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ 2021 లో విడాకులు తీసుకున్నారు బిల్‌గేట్స్‌, మెలిందా దంపతులు.

మైక్రోసాఫ్ట్‌ అధినేతలుగానే కాకుండా పలు ధార్మిక కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొన్న ఈ జంట విడిపోవడం అప్పట్లో యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్‌ కోసం కలిసి పనిచేస్తామని వారు ప్రకటించిన విషయం తెలిసిందే.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version
Skip to toolbar