Meta: మెటా,ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు భారీ షాక్ ఇవ్వనుంది. ఇక నుంచి నెలవారీగా ఛార్జీలు వసూలు చేయనుంది. మెుదట.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో వెరిఫికేషన్ ఛార్జీలను విధించనున్నారు. ఆ తర్వాత మిగతా దేశాల్లో దీనిని అమలు చేయనున్నారు.
ఎలాన్ మస్క్ బాటలో మార్క్ జుకర్ బర్గ్.. (Meta)
ట్విట్టర్ బాస్.. ఎలాన్ మస్క్ బాటలో మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ పయనిస్తున్నారు. ఇప్పటి వరకు ఫేస్ బుక్.. ఇన్ స్టాగ్రామ్ ల సేవల్ని ఉచితంగా అందించిన జుకర్ బర్గ్.. ఇప్పుడు యూజర్లకు షాక్ ఇచ్చారు. ఇక నుంచి ప్రతినెలా ఛార్జీలు వసూలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రపంచ దేశాల్లో ఇప్పటి వరకు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సేవలు ఉచితంగా అందించబడ్డాయి. ఇక రాబోయే రోజుల్లో బ్లూ టిక్ యూజర్ల నుంచి పెద్ద మొత్తంలో ఛార్జీలు వసూలు చేయనున్నట్లు జుకర్ బర్గ్ ప్రకటించారు.
నెలకు ఛార్జీలు ఇలా ఉంటాయి..
ఇప్పటి వరకు.. ఫ్రీగా వినియోగించుకునే మెటా, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లు రానున్న రోజుల్లో భారం కానున్నాయి. ఇప్పటికే ట్విట్టర్ బ్లూ టిక్ పేరుతో నెలసరి ఛార్జీలు వసూలు చేస్తుండగా.. అదే మార్గంలో మెటా వెళ్లనుంది. బ్లూటిక్ హోల్డర్ల నుంచి డబ్బులు వసూలు చేయనున్నట్లు.. మార్క్ జుకర్ బర్గ్ అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వ ఐడీలతో ఫేస్‌బుక్ బ్లూటిక్ హోల్డర్ల అకౌంట్లను పరిశీలించనున్నారు. మెుదటగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో వెరిఫికేషన్ ఛార్జీలను విధించనున్నారు. ఆ తర్వాత మిగతా దేశాల్లో బ్లూ టిక్ యూజర్ల నుంచి పెద్ద మొత్తంలో యూజర్ ఛార్జీలు వసూలు చేయనున్నారు. బ్లూ వెరిఫికేషన్‌తో ఫేక్ అకౌంట్ల నుంచి యూజర్లు సురక్షితంగా ఉండవచ్చని.. ఈ సందర్భంగా జుకర్ బర్గ్ తెలిపారు. దీని వలన యూజర్లలో విశ్వసనీయత పెరగుతుందని అన్నారు. అలాగే యూజర్లకు రీచ్,సెక్యూరిటీ పెరిగే అవకాశం ఉందన్నారు. ఇక మెటా ప్రకటించినట్లుగా ఐఓఎస్ యూజర్లు నెలకు 14.99 డాలర్లు, వెబ్ యూజర్ల నుంచి నెలకు 11.99 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.