Site icon Prime9

Gift to Wife: భార్యకు ప్రేమతో ఖరీదైన డైమండ్‌ రింగ్‌ ఇచ్చిన కెనెడియన్ సింగర్ జస్టిన్ బీబా.. దీని విలువ ఎంతో తెలుసా?

Gift to Wife

Gift to Wife

Gift to Wife: కెనెడియన్‌ సింగర్‌ జస్టిన్‌ బీబా తన పాప్‌ సాంగ్స్‌తో 2009 నుంచి యావత్‌ ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు. 16 ఏళ్ల అతి చిన్న వయసులో మంచి పాప్‌ సింగర్‌గా పేరు సంపాదించుకున్నాడు.తాజాగా తన ప్రెగ్నెంట్‌ భార్యకు అత్యంత ఖరీదైన రూ.12 కోట్లు విలువ చేసే డైమండ్‌ రింగ్‌ను బహుకరించారు. త్వరలోనే బీబా తండ్రి కాబోతున్నాడన్న సంతోషంతో భార్యకు అత్యంత ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చాడు. మే నెల ప్రారంభంలో జస్టిన్‌ బీబా భార్య హెయిలీలు ఇద్దరు కలిసి సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఇటీవల ఈ జంట హవాయి వెళ్లినప్పుడు త్వరలోనే తమ మొదటి బేబీని ఎక్స్‌పెక్ట్‌ చేయబోతున్నామని బహిరంగంగా ప్రకటించారు.

ఇదిలా ఉండగా జస్టిన్‌ తన భార్య కు కొత్తగా గిఫ్ట్‌ ఇచ్చిన డైమండ్‌ రింగ్‌ను ఆమె తన సోషిల్‌ మీడియా అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. గతంలో బీబా ఇచ్చిన ఆరు లక్షల డాలర్ల ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ను చిటికెన్‌ వేలుకు బదిలీ మార్చేశారు. కొత్త రింగ్‌ను ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ స్థానంలో పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా టిఫానీ అండ్‌ కంపెనీ కూడా ఈ జంటకు డైమండ్‌ రింగ్‌లు అన్నీ తాము తయారు చేసి ఇచ్చినవేనని పేర్కొంది.

ప్రెగ్నెన్సీ గురించి ..(Gift to Wife)

ఇదిలా ఉండగా ఫ్యాన్స్‌ హెయిలీ కొత్త డైమండ్‌ గురించి సోషల్‌ మీడియాలో ఆసక్తిగా వెతుకుతున్నారు. డైమండ్‌ ఎక్స్‌ఫర్ట్‌ మాక్స్‌వల్‌ స్టోన్‌ హెయిలీ కలెక్షన్స్‌ గురించి ప్రస్తావిస్తూ…2018లో ఆమె ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ను ఒవల్‌ షేఫ్‌ డైమండ్‌ రింగ్‌ను తామే తయారు చేసి ఇచ్చామని తెలిపింది. కాగా హెయిలీకి ఇప్పటి వరకు రెండు ఖరీదైన రింగులు ఇచ్చాడు జస్టిన్‌ .హెయిలీ కూడా మూడు నెలల తర్వాత యూ ట్యూబ్‌లో దర్శనమిచ్చారు. ఆ సమయంలోనే ఆమె తన ప్రెగ్నెన్సీ గురించి బహిరంగపర్చారు.

ఇక సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ పుట్టబోయే బిడ్డ పేరు గురించి పెద్ద ఎత్తున సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఏమోరీ బీబా అని పేరు పెట్టాలని సూచించేవారు కొందరు. కాగా ఈ పేరును సెలెనా గోమెజ్‌ తనకు పుట్టబోయే బిడ్డపేరు పెడతానని అప్పట్లో చెప్పారు. ప్రస్తుతం ఈ పేరును పెట్టాలని ఆన్‌లైన్‌లో బీబా, హెయిలీ అభిమానులు సూచిస్తున్నారు. ఇక వీరిద్దరు రిలేషన్‌షిప్‌ కూడా విచిత్రంగా జరిగింది. వీరు యూత్‌గా ఉన్నప్పుడు డేటింగ్‌ అటు తర్వాత ఎంగేజ్‌మెంట్‌ .. జస్టిన్‌ సెలెనా గోమెజ్‌తో బ్రేకప్‌ చెప్పేసిన తర్వాత 2018లో హెయిలీని పెళ్లి చేసుకున్నాడు బీబా. ప్రస్తుతం ఈ జంట బేబీ డెలివరీ కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలో జస్టిన్‌ తండ్రి కాబోతున్నాడన్న మాట..

Exit mobile version