Muhammad Yunus Considering Resignation: పొరుగు దేశం బంగ్లాలో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. బంగ్లాలో రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడం వల్ల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ నహిద్ ఇస్లామ్‌ను ఊటంకిస్తూ బీబీసీ బంగ్లాదేశ్ రిపోర్ట్ చేసింది.
ఉదయం నుంచి వార్తాలు..
యూనస్ రాజీనామా వార్త గురించి శుక్రవారం ఉదయం నుంచి తాము వింటున్నామని ఇస్లామ్ నహిద్ బీబీసీ బంగ్లా తెలిపింది. విషయం గురించి చర్చించేందుకు అతడిని కలవడానికి వెళ్లినట్లు చెప్పారు. రాజీనామా గురించి ఆలోచిస్తున్నానని యూనస్ తనతో చెప్పారని పేర్కొన్నారు. బంగ్లాలోని రాజకీయ పార్టీలన్నీ ఐక్యంగా లేకపోతే తాను పనిచేయలేనని చెప్పారన్నారు. దేశ భద్రత, భవిష్యత్ కోసం బలంగా ఉండాలని తాను ఆయనకు చెప్పినట్లు వివరించారు. పార్టీలు ఐక్యంగా ఉండి ఆయనకు సహకరిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. పార్టీలకు ఆయనపై విశ్వసనీయత లేనప్పుడు యూనస్ పదవిలో ఎలా కొనసాగుతారు?’ అని ఇస్లామ్ నహిద్ బీబీసీ బంగ్లాతో అన్నారు.
గతేడాది బంగ్లాలో రాజకీయ అస్థిరత..
గతేడాది బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత నెలకొన్నది. బంగ్లాలో ఉద్యోగాల కల్పనలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది. చివరకు విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రజా ఉద్యమానికి జడసి ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వీడారు. రంగంలోకి దిగిన ఆర్మీ బంగ్లాను తమ చేతుల్లోకి తీసుకుంది. తర్వాత బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వయిజర్‌గా నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టారు. గతేడాది ఆగస్టు 8వ తేదీన తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ప్రమాణ స్వీకారం చేశారు.