Site icon Prime9

Anthony Albanese: ఇండియా చాట్, జిలేబీ సో టేస్టీ అంటున్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని

Anthony Albanese

Anthony Albanese

Anthony Albanese: ఇండియా రుచులు దేశవిదేశాలను దాటాయన్న మాట నిజమే. మన ఫుడ్స్ కి విదేశాల్లో మంచి క్రేజ్ ఉంది. అందులోనూ ప్రధాని మోడీ ఆ ఫుడ్స్ ని ట్రై చేయండంటూ రిఫర్ చేస్తే ఇంక అది వేరే లెవెల్ అనే చెప్పాలి. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ కి స్వయానా ప్రధాని మోడీ మన ఇండియన్ స్ట్రీట్ ఫుడ్స్ ని ట్రై చెయ్యమని చెప్పారంట.

ఏం తిన్నారంటే(Anthony Albanese)

దానితో ఇండియాలో స్ట్రీట్ ఫుడ్‌ను ఎంతో ఇష్టంగా తింటున్న ఆంథోని వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. ఇక్కడ ఇంకో విషయమేంటంటే ప్రధాని నరేంద్ర మోదీ రికమండ్ చేయడంతోనే ఆల్బనీస్ చాట్ మరియు జిలేబీని రుచి చూశానని పేర్కొనడం. @AlboMP అల్బనీస్ తన ట్విట్టర్ అకౌంట్‌లో ‘సిడ్నీలోని హారీస్ పార్కు లిటిల్ ఇండియాలో శుక్రవారం రాత్రి భలే గడిచింది. చాట్ కాజ్‌లో చాట్ మరియు జైపూర్ స్వీట్స్‌లో జిలేబీ రుచి చూసాము.. భారత ప్రధాని మోదీ సిఫార్సుతో దీనిని ప్రయత్నించాము’ అంటూ ఆయన నెట్టింట పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు జపాన్ రాయబారి హిరోషి సుజుకీ పూణేలో స్ట్రీట్ ఫుడ్‌ను ఆస్వాదిస్తున్నారు. తన సతీమణితో కలిసి భారతీయ ఆహారాన్ని రుచిచూస్తూ కనిపించారు. తాజాగా పూణె రెస్టారెంట్‌లో వీరిద్దరూ వడపావ్, మసాల పావ్‌లను ఆస్వాదిస్తున్న ఆ వీడియోను నెట్టింట పెట్టారు. దానికి కింద క్యాప్షన్ గా ఇండియన్ ఫుడ్ తినే పోటీలో తన వైఫ్ తనను ఓడించిందని జపాన్ రాయబారి పేర్కొన్నారు.

 

ఇక దీనిపై ప్రధాని మోడీ స్పందించారు. ‘మిస్టర్ అంబాసిడర్ మీరు ఓడినా గెలిచినా పట్టించుకోరు.. కానీ మీరు ఇండియన్ ఫుడ్ ఆస్వాదిస్తూ తినడం ఏదైతే ఉందో చూడటానికి ఆనందంగా ఉంది. వీడియోలు చేస్తూ ఉండండి’ అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం వీరి ట్వీట్లు కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Exit mobile version