Site icon Prime9

North Korea Atrocities: ఉత్తర కొరియా దారుణాలు..గర్భిణీ స్త్రీలు, స్వలింగ సంపర్కులను ఉరితీయడం, వికలాంగులపై మానవ ప్రయోగాలు.

North Korea Atrocities

North Korea Atrocities

North Korea Atrocities:ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తన నియంతృత్వ పాలన గురించి యావత్‌ ప్రపంచానికి తెలుసు. అదీగాక కిమ్‌ తన దేశ ప్రజలు, పౌరుల పట్ల కఠినంగా వ్యహరిస్తాడంటూ.. ఇప్పటికే పలు కథనాలు వెలువడ్డాయి. వాటిలో నిజానిజాలు ఎంత అనేది అందరి మదిలో తలెత్తుతున్న ప్రశ్న. అయితే ఇప్పుడూ అవన్నీ నిజమేనంటూ బల్లగుద్ది మరీ చెబుతోంది దక్షిణ కొరియా ప్రభుత్వ మంత్రిత్వ శాఖ. అందుకు సంబంధించిన వాటిని సమగ్రంగా దర్యాప్తు చేసి మరీ ఆధారాలతో సహా ఒక నివేదికను కూడా తయారు చేసి విడుదల చేసింది.

గర్భిణీలకు ఉరిశిక్షలు..(North Korea Atrocities)

కిమ్‌ నేతృత్వంలో ఉత్తర కొరియా ఎంత ఘోరంగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందో వివరించింది. దక్షిణ కొరియా 2017 నుంచి 2022 మధ్యలో తమ మాతృభూమిని వదిఏసి వచ్చేసిన దాదాపు 500 మందికి పైగా ఉత్తర కొరియన్ల నుంచి వివరాలను సేకరించినట్లు కూడా తెలిపింది. దక్షిణ కొరియా మంత్రిత్వశాఖ ఇచ్చిన నివేదికలో.. అక్కడ పౌరులకు జీవించే హక్కే ప్రమాదంలో ఉన్నట్లు తెలిపింది. పిల్లల దగ్గర నుంచి వికలాంగులు, గర్భిణీల వరకు ఎవరినీ వదిలిపెట్టకుండా ఉరిశిక్షలు అమలు చేసినట్లు వెల్లడించింది. వారిని బ బెదిరింపులకు గురి చేసి బలవంతంగా మానవ ప్రయోగాల్లోకి దించినట్లు పేర్కొంది.

మరుగుజ్జులపై ప్రయోగాలు..

నర్సు చేత బలవంతంగా మరుగుజ్జుల జాబితాను తయారు చేయించి .. వారిపై మానవ ప్రయోగాలు నిర్వహించిందని తెలిపింది. ఒక ఆరు నెలల గర్భిణి స్త్రీ తన ఇంటిలో దివగంత కిమ్‌ ఇల్‌ సంగ్‌ చిత్రపటం ఎదుట డ్యాన్స్‌లు చేసిందన్న కారణంతో ఉరితీశారు. అలాగే దక్షిణ కొరియా మీడియాకు సంబంధించి ఏదైనా ఆన్‌లైన్‌లో షేర్‌చేసినా, అక్కడ నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చినా వారందర్నీ ఉరితీసినట్లు వెల్లడించింది. అలాగే దక్షిణ కొరియాకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ని చూస్తూనల్లమందు సేవించిన ఆరుగురు యువకులను నిర్ధాక్షిణ్యంగా కాల్చి చెప్పినట్లు పేర్కొంది.

మనుషులను మానవ ప్రయోగాల కోసం నిద్రమాత్రలు ఇచ్చి మరీ ఆస్పత్రికి తరలించింది. ముఖ్యంగా వికలాంగులు, మరుగుజ్జుగా ఉన్నవారిపై ఇష్టారాజ్యంగా మానవ ప్రయోగాలు నిర్వహించారంటూ..అ‍క్కడ జరిగిన భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి సుమారు 450 పేజీల నివేదికను దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ బహిరంగపర్చింది.స్వలింగ సంపర్కులు దేశం నుండి పారిపోవడానికి ప్రయత్నించినందుకు కూడా మరణశిక్ష విధించిందని ఈ నివేదిక తెలిపింది.

 

Exit mobile version