CoviShield Vaccine: యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికించిన విషయం తెలిసిందే. 2020లో వచ్చిన కోవిడ్ -19కు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చనిపోయారు. ఈ వైరస్ అరికట్టేందుకు మార్కెట్లోకి కొన్ని వ్యాక్సిన్‌లు వచ్చాయి. వాటిలో బ్రిటన్‌కు చెందిన ఫార్మా దిగ్గజం అస్ర్టాజెనెకా ఒకటి. అయితే ఈ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని, కొన్ని సార్లు ప్రాణాలు కోల్పేయే ప్రమాదం ఉందనిఅస్ర్టాజెనెకా కోర్టులో అంగీకరించిందని బ్రిటన్‌కు చెందిన టెలిగ్రాప్ పత్రిక వెల్లడించింది. అయితే ఈ వ్యాక్సిన్‌ను అస్ర్టాజెనెకా ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ భాగస్వామ్యంతో తయారు చేసింది. ఇక ఇండియా విషయానికి వస్తే ఇక్కడ సెరమ్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో కలిసి కోవిడ్ షీల్డ్ పేరుతో ఉత్పత్తి ప్రారంభించి మార్కెటింగ్ కూడా చేసింది.
సైడ్ ఎఫెక్ట్స్ వివాదం..(CoviShield Vaccine)
బ్రిటన్ కోర్టులో కోవిడ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తాయని అంగీకరించిన వారం తర్వాత ఆస్ర్టాజనెకా గ్లోబల్ మార్కెట్ల నుంచి కోవిడ్ వ్యాక్సిన్‌ను ఉపసంహరించుకుంటన్నట్లు మంగళవారం నాడు ప్రకటించింది. ఇక నుంచి ఈ వ్యాక్సిన్‌ను వాణిజ్యపరంగా విక్రయాలు జరపమని, అలాగే ఇక నుంచి వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడం కానీ.. సరఫరా చేయడం కానీ జరగదని స్పష్టం చేసింది. అయితే ఈ వ్యాక్సిన్‌ను అప్‌డేట్ చేసి ఒక వేళ కొత్త రకం వేరియెంట్ వచ్చినా దాన్ని తగ్గించే అవకాశం ఉన్నా.. ఇక నుంచి ఉత్పత్తి నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చింది. టెలిగ్రాప్ పత్రిక వార్త ప్రకారం చూస్తే ఈ వ్యాక్సిన్ ఇక నుంచి యూరోపియన్ యూనియన్ మార్కెట్లో అందుబాటులో ఉండదని, స్వచ్చందంగా మార్కెట్ల నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిందని తెలిపింది. ఆస్ర్లాజెనెకా వ్యాక్సిన్ వేసుకున్న వారు చనిపోవడమో లేదా తీవ్రంగా గాయపడ్డమో లేదా టీటీఎస్ –థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్‌తో థ్రాంబోసిస్ -బారినపడిన వారు చాలా మంది ఉన్నారు. టీటీఎస్ వల్ల కొంత మందిలో రక్తం గడ్డకట్టడం, బ్లడ్ ప్లేట్ లేట్ కౌంట్ తగ్గిపోవడం జరుగుతుందని ఫార్మా కంపెనీ అంగీకరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ర్టాజెనెకా హైకోర్టులో లీగల్ డాక్యుమెంట్ సమర్పించింది. అయితే డాక్యుమెంట్‌లో కోవిడ్ వ్యాక్సిన్ ద్వారా ఎప్పుడో అరుదుగా టీటీఎస్ వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
అయితే లాయర్లు మాత్రం ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని, వాస్తవానికి కంపెనీ ఈ వ్యాక్సిన్ బాగా పనిచేస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని అమ్మకాలు పెంచుకుందని, కోర్టులో వాదించారు. అయితే ఆస్ట్రాజెనెకా మాత్రం తాము అలాంటి హామీలు ఇవ్వలేదని తిప్పికొట్టింది. కాగా ఇప్పటి వరకు హైకోర్టులో ఆస్ట్రాజెనెకాపై సుమారు 51 కేసులు నమోదు అయ్యాయి. వాక్సిన్ బారిన పడిన బాధితులు, చనిపోయిన వారి బంధువులు కంపెనీ నుంచి సుమారు వంది మిలియన్ పౌండ్ల పరిహారం డిమాండ్ చేసినట్లు టెలిగ్రాప్ వెల్లడించింది.
మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం సారా మూర్ అనే లీగల్ కంపెనీ.. ప్రస్తుతం వాక్సిన్ బాధితుల తరపున కంపెనీకి వ్యతిరేకంగా కోర్టులో న్యాయపోరాటం చేస్తోంది. అయితే ఆస్ట్రాజెనెకా ప్రభుత్వం .. దాని లాయర్లు మాత్రం బాధితుల గురించి విచారం వ్యక్తం చేయకుండా నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడింది. ప్రజల జీవితాలను వారు తేలికగా తీసుకుంటున్నారని లా కంపెనీ మండిపడింది. దీనికి ఆస్ర్టాజెనెకా స్పందించింది. తమ వ్యాక్సిన్ ద్వారా ప్రియమైన వారిని కోల్పోతే వారి కుటుంబాలకు విచారం వ్యక్తం చేస్తున్నామని చేతులు దులుపుకుంది. రోగుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని కంపెనీ తెలిపింది. తమ కంపెనీ ఉత్పత్తి చేసే మందులతో పాటు వ్యాక్సిన్‌ల తయారీలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తామని చెప్పి తప్పించుకుంది.