Site icon Prime9

Monterey Park: అమెరికాలో మరోసారి కాల్పులు.. 10 మంది మృతి!

montery park

montery park

Monterey Park: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. లాస్‌ ఏంజెల్స్‌ లో జరుగుతోన్న చైనీస్‌ లూనార్‌ న్యూఇయర్‌ వేడుకల్లో కాల్పులు చెలరేగాయి.
ఈ ఘటనలో 10 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తుంది.

అమెరికా ( America) లో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. లాస్‌ఏంజెల్స్‌ సమీపంలోని మాంటేరీ పార్క్‌లో శనివారం రాత్రి 10 గంటల సమయంలో
ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులకు దిగాడు. చైనీయుల లూనార్‌ న్యూఇయర్‌ ఫెస్టివల్‌ వేడుకలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం 10 మందికిపైగా ఈ ఘటనలో చనిపోయినట్లు.. అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనలో మరో ఆరుగురు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు ఇప్పటివరకు గుర్తించలేదు.

ఈ ప్రమాద సమయంలో వేలాది మంది పార్కులో ఉన్నారు.

మాంటేరీ పార్క్‌ లాస్‌ ఏంజెల్స్‌కు కౌంటీగా ఉంది. ఇది ప్రధాన నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది.

ప్రత్యక్ష సాక్షులు చెప్పిన కథనం ప్రకారం ఓ వ్యక్తి భారీ మెషీన్‌ గన్‌తో కాల్పులకు దిగినట్లు తెలిపారు.

ఘటన జరిగిన ప్రాంతంలోనే సియాంగ్‌ వాన్‌ చాయి అనే వ్యక్తి బార్బెక్యూ రెస్టారెంట్‌ నిర్వహిస్తున్నాడు.

రాత్రి ముగ్గురు వ్యక్తులు ప్రాణభయంతో అతడి రెస్టారెంట్లోకి వచ్చి తలుపులు వేసేశారని.

బయట ఓ వ్యక్తి గన్‌తో కాల్పులు జరుపుతున్నాడని వారు చెప్పినట్లు సియూంగ్‌ వెల్లడించాడు.

ఆ సాయుధుడి వద్ద భారీగా మందుగుండు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. సమీపంలోని డ్యాన్సింగ్‌ క్లబ్‌ లక్ష్యంగా అతడు దాడి చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొన్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
క్షతగాత్రులకు సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై దర్యా‍ప్తును ప్రారంభించిన పోలీసులు.

అంతకు ముందు రోజు వేలాదిమంది ఈ వేడుకకు హాజరు.
ఈ రెండు రోజుల పండుగ కోసం సమారు 10 వేల మంది దాకా హాజరు.
లాస్‌ ఏంజెల్స్‌కు 11 కిలోమీటర్ల దూరంలో ఉండే మాంటెరీ పార్క్‌లో ఆసియా జనాభా ఎక్కువ.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version