American woman: అమెరికాలోని ఒక మార్చురీలో పనిచేసే మహిళ, ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తికి 20 బాక్సుల మానవ శరీర భాగాలను విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. అర్కాన్సాస్‌కు చెందిన కాండేస్ చాప్‌మన్ స్కాట్, ఒక మెడికల్ స్కూల్ నుండి పుర్రె, ఎముకలు మరియు దంతాలను దొంగిలించి, వాటిని పెన్సిల్వేనియా వ్యక్తికి $11,000కి విక్రయించినట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది.
స్కాట్ ఆ వ్యక్తిని ‘Oddities’ అనే ఫేస్ బుక్ గ్రూప్ ద్వారా కలుసుకుని అతనికి ఆన్‌లైన్‌లో వస్తువులను విక్రయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్కాట్ జైల్లో ఉంది. ఆమె బెయిల్ పిటిషన్ పై మంగళవారం విచారణ జరగనుంది. .36 ఏళ్ల స్కాట్ అర్కాన్సాస్ సెంట్రల్ మార్చురీ సర్వీసెస్‌లో పని చేస్తుంది. అక్కడ ఆమె విధినిర్వహణలో భాగంగా అవశేషాలను రవాణా చేయడం, దహనం చేయడం మరియు శుభ్రం చేయడం చేస్తుంది.
అక్టోబరు 2021లో ఆ వ్యక్తిని సంప్రదించి, అతనికి “పూర్తిగా చెక్కుచెదరకుండా శుభ్రం చేసిన మెదడు” అందించినట్లు కూడా ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.ఫెడరల్ నేరారోపణలో వ్యక్తి పేరు లేదు, కానీ , పెన్సిల్వేనియాలో వేర్వేరు ఆరోపణలు అతన్ని జెరెమీ లీ పౌలాగా గుర్తించాయి.శ్రీమతి స్కాట్ మరియు వ్యక్తి మధ్య ఆర్థిక లావాదేవీలు తొమ్మిది నెలల పాటు కొనసాగాయి ఈ సమయంలో ఆమె అతనికి పిండాలు, గుండెలు, జననేంద్రియాలు, ఊపిరితిత్తులు, చర్మం, మెదడు మరియు ఇతర శరీర భాగాలను విక్రయించింది.స్కాట్ విచరాణ పూర్తి అయ్యేవరకు జైల్లోనే ఉండాలని ప్రోసిక్యూటర్ అన్నారు. జడ్జిథామస్ రే స్కాట్ ప్రవర్తన దిగ్భ్రాంతికరమైనది మరియు నీచమైనదని అంగీకరించారు.