Site icon Prime9

Air India: రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన ఎయిర్ ఇండియా విమానం

Air India

Air India

Air India: ఎయిరిండియా విమానం రష్యాలో ఎమెర్జెన్సీ ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో కు బయలు దేరిన విమానం ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా రష్యా కు మళ్లించారు. అక్కడ సురరక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రష్యాలోని మగడాన్ ఎయిర్ పోర్టులో విమానం ల్యాండ్ అయిన విషయాన్ని ఎయిరిండియా అధికారులు తెలిపారు.

 

సాంకేతిక సమస్య రావడంతో(Air India)

ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్తున్న ఎయిరిండియా విమానం (AI173) ఇంజిన్‌లో ఒకదానిలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీనిని గుర్తించిన వెంటనే విమానాన్ని రష్యా వైపు మళ్లించాలని నిర్ణయించారు. అనంతరం అది రష్యాలోని మాగడాన్ విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. ఆ సమయంలో విమానంలో 216 మంది ప్రయాణికులతో పాటు 16 మంది సిబ్బంది ఉన్నట్టు ఎయిరిండియా వెల్లడించింది. అక్కడ ల్యాండ్ వెంటనే ప్రయాణికులకు అవసరమైన వసతి కల్పించామన్నారు. అంతేకాకుండా వారి వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలైనంత త్వరగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది. విమానానికి కావాల్సిన పరీక్షలన్నీ టెక్నికల్ సిబ్బంది చేస్తున్నారని ఎయిరిండియా అధికారులు వెల్లడించారు.

 

Exit mobile version