Site icon Prime9

Afghanistan: ఈ దేశంలో కండోమ్స్, గర్భనిరోధక పిల్స్ నిషేధం

Afghanistan

Afghanistan

Afghanistan: అప్ఘ‌నిస్థాన్ ..తాలిబ‌న్ల చేతిలోకి వెళ్ళాక అక్క‌డి ప్ర‌జ‌లు ప్ర‌త్య‌క్ష న‌ర‌కం అంటే ఏంటో చూస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఒక‌ప‌క్క‌, తాలిబ‌న్ల ఆంక్ష‌లు మ‌రోప‌క్క‌, ప్ర‌కృతి విల‌యాలు ఇంకోప‌క్క‌..ఇలా అన్ని విధాలుగా నానా అగ‌చాట్లు ప‌డుతున్నారు ఆ దేశ ప్ర‌జ‌లు.

తాజాగా అప్ఘనిస్తాన్ లో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు తాలిబన్లు. దేశంలోని రెండు ప్రధాన నగరాల్లో గర్భనిరోధక టాబ్లెట్స్ , కండోమ్స్ ను నిషేధించారు.

అఫ్ఘన్ లో ముస్లిం జనాభాను నియంత్రించడానికి పాశ్చాత్య దేశాలు కుట్ర చేస్తున్నాయని తాలిబన్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రెండు సిటిల్లో గర్భనిరోధన మాత్రలను బ్యాన్ చేశారు.

తాలిబన్ల అరాచక పాలనలో(Afghanistan)

2021, ఆగష్టులో అమెరికా సైన్యం అప్ఘన్ నుంచి వెళ్లిపోయాయి. అప్పటి నుంచి తాలిబన్లు ఆ దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు.

తమ పాలనను ఒప్పుకున్నారా సరే లేదంటే ప్రాణాలు దిక్కులేకుండా పోయింది.

గత్యంతరం లేని పరిస్థితుల్లో అక్కడి ప్రజలు తాలిబన్ల ప్రభుత్వానికి ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తోంది.

ఇప్పటికే తాలిబన్ల అరాచక పాలన చూసిన మహిళలు మాత్రం వారి పాలనలో బతకడం కంటే చావడం మేలు అన్నట్టుగా ఉన్నారు. ఈ క్రమంలో దేశం నుంచి పారిపోయేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఫార్మసీలకు బెదిరింపులు

గత రెండేళ్లుగా ఆ దేశ మహిళలకు ప్రసూతి గురించి ప్రాధమిక సమాచారం కూడా అందుబాటులో లేకుండా చేశారు. తాలిబన్లు ఇంటింటికీ వెళ్లి గర్భనిరోధక మందులు, కండోమ్ లు అమ్మవద్దని బెదిరిస్తున్నట్టు అక్కడి మంత్రాసానులు చెబుతున్నారు.

గర్భనిరోధక మందులు అమ్మకాలు జరపవద్దని .. తుపాకీలతో పలు సార్లు బెదిరించారని కాబూల్ కు చెందిన ఫార్మసీ ఓనర్ తెలిపారు.

ప్రతి ఫార్మసీ కి వెళ్లి తనిఖీలు చేస్తున్నట్టు సమాచారం. దీంతో కండోమ్స్.. ఇతర గర్భనిరోధక ఉత్పత్తులను అమ్మడం నిలిపివేశామని ఆయన చెప్పారు.

 

బొమ్మ అయినా సరే ముఖం కనిపించొద్దు

గతంలోనే మహిళలపై కఠినమైన ఆంక్షలు విధించారు తాలిబన్లు. పరుషులు లేకుండా మహిళలు ఇంటి నుంచి బయటకు రాకూడదని, బురఖా ధరించాలని, బాలికల సెకండరీ స్కూళ్లను మూసివేయాలని , మహిళలు ఉద్యోగం చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు.

తర్వాత దేశంలోని మహిళలకు యూనివర్సిటీ విద్యను కూడా నిషేధించారు.

అక్కడ మహిళల పరిస్థితి ఎలా ఉందంటే కేవలం ఆడవాళ్లే కాదు.. మహిళలను పోలిన బొమ్మ అయినా సరే ముఖం కనిపించకుండా నిబంధనలు పెట్టారు.

ఈ మేరకు దేశవ్యాప్తంగా షాపులకు ఆర్డర్స్ ఇచ్చారు. షాపుల ముందు పెట్టె బొమ్మలకు ముఖాలు కనిపించకుండా తప్పని సరిగా బురఖా ధరించాలని ఆదేశించారు.

అయితే, మహిళలు కుటుండ నియంత్రణ , గర్భ నిరోధక మాత్రలు పొందడం వారి హక్కు అని సామాజిక కార్యకర్త షబ్నం నసిమి చెప్పారు.

అప్ఘన్ మహిళలు కోరుకున్న దానికంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్నారని ఆమె అన్నారు.

 

 

 

Exit mobile version