Serial killer: రువాండాలో ఒక సీరియల్ కిల్లర్ తాను బార్లలో కలుసుకున్న మహిళలను హత్య చేసి, తన వంటగదిలో గొయ్యితీసి పాతిపెట్టినట్లు బయటపడింది. డెనిస్ కజుంగుగా గుర్తించబడిన 34 ఏళ్ల వ్యక్తిని మంగళవారం అరెస్టు చేసారు. బాధితులను వెంబడించే ముందు వారిని స్టడీ చేసినట్లు ఒప్పుకున్నాడు.
14 మంది బాధితులు..(Serial killer)
రాజధాని కిగాలీ శివారులోని తన అద్దె ఇంటికి వారిని రప్పించేవాడు.ఎక్కువగా వేశ్యలు అయిన తన బాధితులు తన ఇంట్లోకి ప్రవేశించినప్పుడు, వారిని గొంతుకోసి చంపే ముందు వారి వస్తువులను దోచుకుంటానని తరువాత వంటగదిలో తవ్విన గోతిలో పడేసేవాడినని కజుంగు పోలీసుల వద్ద అంగీకరించాడు.ప్రముఖ సీరియల్ కిల్లర్‌లపై డాక్యుమెంటరీలు చూడటం ద్వారా చంపడం నేర్చుకున్నానని, వేశ్యలుగా ఉన్న మహిళలను ఎక్కువగా తన బాధితులుగా ఎంచుకుంటానని కజుంగు ఒప్పుకున్నాడు, ఎందుకంటే వారి కోసం చూసే సన్నిహిత కుటుంబం లేదా స్నేహితులు ఎవరూ ఉండరని చెప్పాడు.ఇప్పటివరకు కనుగొనబడిన మృతదేహాల సంఖ్య 14 అని, అయితే ఫోరెన్సిక్ పరిశోధనలు పూర్తవ్వాల్సి ఉందని అధికారులు తెలిపారు.