Site icon Prime9

Heavy Rains : హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలకు 54 మంది మృతి..

54 members died due to heavy rains in himachal pradesh and uttarakhandh

54 members died due to heavy rains in himachal pradesh and uttarakhandh

Heavy Rains : హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటి వరకు 54 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా కొండ చరియలు విరిగిపడడంతో జాతీయ రహదారులపై రవాణా స్తంభించింది. పలు ప్రాంతాల్లో ఇళ్లు ధ్వంసమవ్వగా.. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మృతి చెందిన 54 మందిలో 51 మంది హిమాచల్‌ ప్రదేశ్‌ వసూలు ఉన్నారు. సిమ్లాలోని సమ్మర్ హిల్ ప్రాంతంలో శివాలయంపై రెండు కొండచరియలు విరిగిపడడంతో 14 మంది భక్తులు చనిపోయారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. అదే విధంగా సోలాన్‌లో ఒకే  కుటుంబంలోని ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

రాష్ట్రంలోని 9 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో రూ. 7,171 కోట్ల నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం అంచనా వేసింది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పంద్రాగస్టు వేడుకలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఉత్తరాఖండ్‌ లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఇప్పటికే ముగ్గురు మరణించగా మరో 10 మంది గల్లంతయ్యారు.

ఇక మరోవైపు బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి వెళ్లే రహదారులపై రవాణాకు ఆటంకం ఏర్పడింది. దీంతో అధికారులు చార్‌ధామ్ యాత్రను రెండు రోజుల పాటు నిలిపివేశారు. ఊహించని ఈ పరిణామాలతో స్థానిక ప్రజలు తేవేర భయాందోళనలకు గురవుతున్నారు.

Exit mobile version