Congo massacre:తూర్పుకాంగోలో మిత్రరాజ్యాల డెమోక్రటిక్ ఫోర్సెస్ మిలిటెంట్లు జరిపినజంట దాడుల్లో 40 మందికి పైగా పౌరులు హతమయ్యారని స్థానిక అధికారులు గురువారం తెలిపారు.ఇస్లామిక్ అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ఎడిఎఫ్) తూర్పు కాంగోలోని అత్యంత ఘోరమైన సాయుధ మిలీషియాలలో ఒకటి.
కత్తులతో చంపేసారు..(Congo massacre)
ఇది వేలాది మంది పౌరులను చంపింది.ఈ గ్రూపు అత్యంత హింసాత్మకమైనది. వరుస బాంబు దాడులు మరియు పౌర హత్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.మిలిటెంట్లు బుధవారం సాయంత్రం మరియు గురువారం తెల్లవారుజామున ఉత్తర కివు ప్రావిన్స్‌లోని బెని భూభాగంలోని పొరుగు గ్రామాలైన ముకొండి మరియు మౌసాపై దాడి చేసినట్లు అధికారులు తెలిపారు.ముకొండిలో 37 మంది, మౌసాలో ఎనిమిది మంది మరణించారని స్థానిక సివిల్ సొసైటీ సభ్యుడు ముంబెరే ఆర్సేన్ తెలిపారు. వారందరినీ కత్తులతో చంపారని అతను చెప్పాడు.
ఎడిఎఫ్ పై ఆర్మీ ఆపరేషన్..
ఇది 1990 మరియు 2000లలో చెలరేగిన ప్రాంతీయ యుద్ధాల వారసత్వం ఫలితంగా డజన్ల కొద్దీ సాయుధ సమూహాలు తూర్పు కాంగోలో తిరుగుతున్నాయి. మరోవైపు ఈ ప్రాంతంలోని మిలీషియాను లక్ష్యంగా చేసుకుని ఉమ్మడి కాంగో-ఉగాండా సైనిక చర్య 2021 చివరి నుండి కొనసాగుతోంది. అయితే దాడులు కొనసాగుతున్నాయి.2019 చివరలో కాంగో సైన్యం అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ ( ఎడిఎఫ్ )ని నిర్మూలించే ప్రచారాన్ని ప్రారంభించింది. కాంగో భూభాగం నుండి ఎడిఎఫ్ ను తరిమికొట్టే ప్రయత్నంలో మేము ఒక కొత్త ఆపరేషన్‌ను ప్రారంభించామని ఆర్మీ ప్రతినిధి ఆంటోనీ మ్వాలుషాయి చెప్పారు.
మరోవైపు ఆఫ్గానిస్తాన్‌లో ఐసిస్ టెర్రరిస్టులు మరోమారు రెచ్చిపోయారు. తాలిబన్ గవర్నర్ మహ్మద్ దావూద్ ముజ్జామిల్ కార్యాలయంపై దాడి చేసి చంపేశారు. ఆఫ్గానిస్తాన్‌లో బాల్ఖ్ ప్రావిన్స్‌కు గవర్నర్ అయిన ముజ్జామిల్ ఐసీస్ తీవ్రవాదులపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారని పేరు సంపాదించుకున్నారు. ఇదిలా ఉండగా బుధవారం నాడు కాబూల్ నుంచి ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు గవర్నర్‌ను కలిసిన తర్వాత రోజు ఈ హత్య జరిగింది. కాగా 2021లో తాలిబన్లు ఆఫ్గానిస్తాన్‌లో అధికారం హస్తగతం చేసుకున్న తర్వాత హై ర్యాంకింగ్ గవర్నర్ హత్యకు గురికావడం కూడా ఇదే మొదటిసారి కావడం విశేషం.
ఆగస్టు 2021లో ఆఫ్గానిస్తాన్‌లో తాలబన్లు అధికారం హస్తగతం చేసుకున్న తర్వాత నుంచి క్రమంగా హింస తగ్గింది. అయితే ఇటీవల కాలంలో ఐసిస్ టెర్రరిస్టులు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డంతో పరిస్థితి మళ్లీ దారుణంగా తయారైంది. ఈ రోజు ఉదయం జరిగిన పేలుళ్లలో గవర్నర్‌తో పాటు మరో ఇద్దరు దుర్మరణం పాలయ్యారని బాల్ఖ్ ప్రావిన్స్ పోలీసు అధికార ప్రతినిధి అసిఫ్ వజీర్ చెప్పారు. గవర్నర్ కార్యాలయం రెండో అంతస్తులో ఈ పేలుడు సంభవించింది. ఇస్లామ్‌కు శత్రువులే గవర్నర్ ముజ్జామిల్‌ను హత్య చేశారని ప్రభుత్వ అధికార ప్రతినిధి జైబిహుల్లా ముజాహిద్ ట్విట్ చేశారు.