Site icon Prime9

Afghanistan Rains: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ వర్షాలు.. 35 మంది మృ‌తి..

Afghanistan Rains

Afghanistan Rains

Afghanistan Rains: తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో సోమవారం భారీ వర్షం కారణంగా కనీసం 35 మంది మరణించగా 230 మంది గాయపడినట్లు సమాచార మరియు సంస్కృతి విభాగం అధిపతి ఖురైషి బాడ్‌లూన్ తెలిపారు. భారీ తుఫానులు మరియు వర్షాల కారణంగా చెట్లు, గోడలు మరియు ప్రజల ఇళ్ల పైకప్పులు కూలిపోయాయని బడ్లూన్ చెప్పారు.

గాయపడిన వారికి చికిత్స..(Afghanistan Rains)

క్షతగాత్రులతో పాటు బాధితుల మృతదేహాలను నంగర్‌హార్ ప్రాంతీయ ఆసుపత్రికి మరియు ఫాతిమా-తుల్-జహ్రా ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు.బాడ్‌లూన్ షేర్ చేసిన చిత్రాలు తెలుపు మరియు నీలం రంగు యూనిఫారాలు ధరించిన వైద్య సిబ్బంది గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నట్లు చూపించాయి.తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. మృతుల కుటుంబాల సంతాపాన్ని పంచుకుంటున్నాం.ఇస్లామిక్ ఎమిరేట్ యొక్క సంబంధిత సంస్థలు వీలైనంత త్వరగా ప్రభావిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించామని ముజాహిద్ X లో రాశారు, ఈ ఏడాది మేలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఆకస్మిక వరదలు సంభవించడంతో వందలాది మంది మరణించారు.

Exit mobile version