Japan Earthquakes: జపాన్‌లో కొత్త ఏడాది మొదటిరోజే బలమైన భూకంపాలు సంభవించిన సుమారుగా 30 మంది మరణించారు. సోమవారం జపాన్ 155 భూకంపాలతో దెబ్బతింది, వీటిలో ప్రారంభ భూకంపం తీవ్రత 7.6 కాగా పలు భూకంపాలు 6 కంటే ఎక్కువ తీవ్రతతో సంభవించాయని జపాన్ వాతావరణ కార్యాలయం తెలిపింది.
తొలి భూకంపం సంభవించిన వెంటనే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు, 5 అడుగుల ఎత్తులో అలలు దేశాన్ని తాకాయి. మంగళవారం దాదాపు 33,000 గృహాలకు విద్యుత్తు సరపరా నిలిచిపోయింది. సునామీ అలలు దేశం యొక్క పశ్చిమ తీరానికి రావడంతో కొన్ని తీర ప్రాంతాల ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు పారిపోయారు. అలల కారణంగా కార్లు, కొన్ని ఇళ్లు సముద్రంలో కొట్టుకుపోయాయి.భూకంపాల కారణంగా బాగా ప్రభావితమైన నోటో ద్వీపకల్పంలో వేలాది మంది సైనిక సిబ్బందిని మోహరించారు. రన్‌వేపై పగుళ్లు ఏర్పడిన కారణంగా ఆ ప్రాంతంలోని విమానాశ్రయాలలో ఒకటి మూసివేయడంతో సహా, దెబ్బతిన్న మరియు బ్లాక్ చేయబడిన రోడ్ల కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌లకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రాంతంలో అనేక రైలు సేవలు మరియు విమాన సర్వీసులు కూడా నిలిపివేయబడ్డాయి.నాలుగు ఎక్స్‌ప్రెస్‌వేలు, రెండు హైస్పీడ్ రైలు సేవలు, 34 లోకల్ రైలు మార్గాలు మరియు 16 ఫెర్రీ లైన్లు నిలిచిపోయాయని జపాన్ రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. భూకంపాల కారణంగా 38 విమానాలు రద్దు చేయబడ్డాయి, రాబోయే రోజుల్లో మరిన్న భూ ప్రకంపనలు సంభవిచే అవకాశముందని జపాన్ వాతావరణ కార్యాలయం హెచ్చరించింది.
సోమవారం నాటి భూకంపం మరియు ఆ తర్వాత సంభవించిన అనేక ఇతర నష్టాల దృశ్యాల వీడియోలు బయటకు వచ్చాయి. కూలిపోయిన భవనాలు, మునిగిపోయిన పడవలు, అనేక కాలిపోయిన గృహాలను వీడియోలు చూపించాయి. జపాన్ ప్రభుత్వం హోన్షు ద్వీపం యొక్క పశ్చిమ తీరంలో తొమ్మిది ప్రిఫెక్చర్లలో 97,000 మందికి పైగా ప్రజలను ఖాళీ చేయవలసిందిగా కోరింది. ఈ వ్యక్తులు స్పోర్ట్స్ హాల్స్ మరియు పాఠశాల వ్యాయామశాలలలో రాత్రి గడిపారు.కనజావా మరియు టొయామా నగరాల మధ్య నాలుగు హాల్టర్ బుల్లెట్ రైలు సర్వీసుల్లో మొత్తం 1,400 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారని పశ్చిమ జపాన్ రైల్వే సోమవారం ఆలస్యంగా తెలిపింది.జపాన్ తరచుగా భూకంపాలకు గురవుతుంది . అక్కడ భవనాలు బలమైన కుదుపులను తట్టుకోగలవని నిర్ధారించుకోవడానికి దేశంలో కఠినమైన నిబంధనలు ఉన్నాయి. సోమవారం నాటి భూకంపానికి ముందు భూకంపం మార్చి 16, 2022న వచ్చింది. ఫుకుషిమాలో 7.3 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపంలో ఇద్దరు మరణించగా 94 మంది గాయపడ్డారు. మార్చి 11, 2011న ఈశాన్య జపాన్‌ను 9.0 తీవ్రతతో సునామీ తాకినప్పుడు సుమారుగా 20,000 మంది మరణించారు.