Canada Lottery: సాధారణంగా కృషితో నాస్తి దుర్భిక్షం.. ఈ మాటను చాలా బలంగా నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఉంటాను.
అదృష్టం, దురదృష్టం వంటి వాటి గురించి ఆలోచించకుండా జీవించేవారు ఎందరో ఉంటారు.
కానీ కొన్ని ఘటనలు చూసినప్పుడు మాత్రం అబ్బా.. మనకి కూడా కొంచెం అదృష్టం ఉంటే బాగుండేది అని అనిపించక మానదు.
నిజంగా అదృష్టం అనేది మనిషి జీవితాన్ని చిటికెలో మార్చేయగలదు.
ఎంత కష్టపడినా రాత్రికి రాత్రే కోటీశ్వరులు కాలేని వాళ్ళు.. అదృష్టముంటే మాత్రం క్షణాల్లో అవ్వొచ్చు. ఎప్పటి నుంచో లాటరీలలో తమ అదృష్టాన్ని ప్రయత్నించే వాళ్ళు ఉన్నారు.
ఇటీవల కాలంలో లాటరీలు తగిలి రాత్రికి రాత్రే చాలా మంది కోటీశ్వరులవుతున్న వారి గురించి వార్తలలో చూస్తూనే ఉంటున్నాం.
ఇప్పుడు తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. అయితే మరీ ఇంత అదృష్టమా అని ఎవరికైనా ఖచ్చితంగా అనిపిస్తుంది.
కేవలం 18 ఏళ్ల వయసున్న అమ్మాయికి ఏకంగా 290 కోట్ల లాటరీ తగిలిన వార్త అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది.
ఆ అమ్మాయి ఎవరు.. అంతా డబ్బు ఎలా గెలుచుకుంది వంటి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
కెనడాలోని అంటారియోకు చెందిన జూలియట్ లామర్ జీవితాన్ని తన 18వ పుట్టిన రోజు పూర్తిగా మార్చేసింది.
18వ పుట్టినరోజున 290 కోట్ల లాటరీ..
జూలియట్.. తన 18వ పుట్టిన రోజు సందర్భంగా గుర్తుండిపోయేలా ప్రత్యేకమైనదేదైనా కొందామని దగ్గర్లోని ఓ స్టోర్‌కి వెళ్లింది.
అయితే తనతో పాటు తాతయ్యను కూడా తీసుకెళ్లింది. ఏం కొనాలో తెలియక అయోమయంలో ఉన్న మనవరాలిని ఓ లాటరీ టికెట్(Canada Lottery) కొనమని సలహా ఇచ్చాడు.
తాత చెప్పినట్టు ఆయన సహాయంతోనే ఓ లాటరీ టికెట్ కొనేసింది జూలియట్.
అంటారియో లాటరీ అండ్ గేమింగ్ కార్పోరేషన్‌కు చెందిన లోటో 6-49 లాటరీ టికెట్ కొని.. అక్కడి నుంచి ఇంటి కెళ్లిపోయింది.
ఇక ఆ తర్వాత జూలియట్.. ఆ లాటరీ టికెట్ గురించి పూర్తిగా మర్చిపోయింది.
కానీ.. జనవరి 7న తన పొరుగింటి వాళ్లకు లాటరీలో ఫ్రైజ్ వచ్చిందని సంతోష పడుతుంటే.. తన దగ్గర కూడా ఓ లాటరీ టికెట్ ఉందన్న విషయం గుర్తుకొచ్చింది.
వెంటనే వెళ్లి అందుకు సంబంధించిన యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంది. అందులో అక్షరాలా 290 కోట్ల రూపాయలు గెలుచుకోవడంతో షాక్‌తో నిర్ఘాంతపోయింది.
కాసేపటికి ఆ షాక్ నుంచి తేరుకుని.. తాను చూసింది నిజమేనా కాదా అని ఒకటి నాలుగు సార్లు చెక్ చేసుకుంది.
అది నిజమేనని నిర్ధారించుకుని.. తన పట్టలేని ఆనందాన్ని కుటుంబసభ్యులతో పంచుకుంది. వాళ్లు కూడా ఆ వార్త విని గాల్లో తేలిపోయారు.
ఆ గెలుచుకున్న లాటరీ డబ్బులతో జూలియట్.. ఫ్యామిలీ కోసం 2 కోట్ల విలువ ఉన్న మెర్సిరెస్ బెంజ్ కార్లు ఐదు కొనుగోలు చేసింది.
100 కోట్లు పెట్టి చార్టర్ విమానం, మరో 40 కోట్లతో లండన్‌లో విలాసవంతమైన ఇల్లు కొనుక్కుంది.
తన భవిష్యత్తు కోసం 150 కోట్లు దాచుకుంది.
దీన్నే అదృష్టం అంటారని ఇప్పుడు అర్దం అవుతుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/