South Africa Gas leak: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌కు తూర్పున ఉన్న బోక్స్‌బర్గ్ సమీపంలో గ్యాస్ లీక్ అవడంతో 16 మంది మరణించారని ప్రావిన్షియల్ ప్రభుత్వ అధిపతి బుధవారం మరణాల పునశ్చరణ తర్వాత తెలిపారు. ఈ ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామని గౌటెంగ్ ప్రావిన్స్ ప్రీమియర్ పన్యాజా లెసుఫీ తెలిపారు.
అక్రమ మైనింగ్ తో లింక్ .. (South Africa Gas leak)
ఇది చాలా విషాదకరమైన ఘటన అని మృతుల్లో ఒక ఏడాది బాలుడు కూడా ఉన్నాడని ఆయన చెప్పారు. అంతకుమందు గ్యాస్ మృతుల సంఖ్య 24 గా పేర్కొన్నప్పటికీ 16 మంది మాత్రమే చనిపోయారని మరలా లెక్కించిన తరువాత తెలిసిందని ఆయన అన్నారు. ప్రమాదస్దలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడివున్నాయి. మరోవైపు గ్యాస్ లీక్‌కు అక్రమ మైనింగ్ కార్యకలాపాలతో సంబంధం ఉండవచ్చని దక్షిణాఫ్రికా మీడియా పేర్కొంది.