Site icon Prime9

Heat waves: యూరప్ లో వేడిగాడ్పులకు 15 వేలమంది మృతి..

Heat waves

Heat waves

Europe: ఈ ఏడాది యూరప్‌లో జూన్‌ నుంచి ఆగస్టు వరకు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. వేడి గాడ్పులకు కనీసం 15వేల మంది మృతి చెంది ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అత్యధికంగా మృతుల సంఖ్య స్పెయిన్‌, జర్మనీలో రికార్డు అయ్యయి. ఈ ఏడాది జూన్‌ నుంచి ఆగస్టు వరకు ఈ మూడు నెలల కాలం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైంది. దీంతో యూరోప్‌ కరువు కోరల్లో చిక్కుకోవాల్సి వచ్చింది. మధ్య యుగం తర్వాత ఈ స్థాయిలో కరువును యూరప్‌ చూడ్డం ఇదే మొదటిసారని డబ్ల్యుహెచ్‌ఓ పేర్కొంది.

డబ్ల్యుహెచ్‌ఓ ప్రాంతీయ డైరెక్టర్‌ యూరప్‌ వ్యవహారాలను చూసే హాన్స్‌ క్లుగే గత వేసవి మూడు నెలల కాలంలో మృతి చెందిన వివరాలు వెల్లడించారు. స్పెయిన్‌లో 4వేల మంది, పోర్చుగల్‌లో 1,000 మంది, బ్రిటన్‌లో 3,200 మంది, జర్మనీలో 4,500 మంది చనిపోయారని ఆయన వివరించారు. ఈ ఏడాది వేసవిలో ఎండ వేడిమి పెరగడంతో ఇతర దేశాల్లో కూడా చాలా మంది చనిపోయి ఉండవచ్చునని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఈజిప్టులో జరుగుతున్న క్లయిమేట్‌ సమ్మిట్‌ ఈ విషయం ప్రస్తావించి దీనికి పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు క్లుగే.

భారీగా పెరిగిన ఉష్ణోగ్రతకు పంటలు ఎండి పోయాయి. అడవుల్లో కార్చిచ్చుఏర్పడింది. పవర్‌గ్రిడ్‌లపై ఒత్తిడి పెరిగింది. ఈ ఏడాది జూన్‌, జూలైలో బ్రిటన్‌లో మొట్టమొదటిసారి ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌ దాటిపోయింది. ఎండ వేడిమి తట్టుకోలేక యూరోప్‌లో చాలా మంది చనిపోయారని డబ్ల్యుహెచ్‌ఓ పేర్కొంది. అత్యధిక ఉష్ణోగ్రత వల్ల ప్రజలు దీర్ఘకాలిక జబ్బులతో బాధ పడాల్సి వస్తుంది. ముఖ్యంగా గుండెజబ్బులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు మధుమేహ వ్యాధులతో తీవ్ర ఇబ్బందులకు లోను కావాల్సి వస్తుందని డబ్ల్యు హెచ్‌ఓ హెచ్చరించింది. తక్షణమే గట్టి చర్యలు తీసుకోకపోతే వచ్చే దశాబ్ద కాలంలో హీట్‌వేవ్‌ వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని డబ్ల్యు హెచ్‌ఓ హెచ్చరించింది.

Exit mobile version