Site icon Prime9

Russia: రష్యాలో సాయుద మిలిటెంట్ల దాడిలో 15 మందికిపైగా మృతి

Russia

Russia

Russia: రష్యాలోని దక్షిణ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్‌లో 15 మందికి పైగా పోలీసు అధికారులు, మతగురువుతో సహా పలువురు పౌరులు సాయుధ మిలిటెంట్ల చేతిలో హతమయ్యారు. ముష్కరులు రెండు నగరాల్లోని రెండు చర్చిలు, ఒక ప్రార్థనా మందిరం, ఒక పోలీసు పోస్ట్‌పై కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.

చర్చి, పోలీసు స్టేషన్ పై దాడులు..(Russia)

డెర్బెంట్ నగరంలోని ఒక ప్రార్థనా మందిరం మరియు చర్చిపై సాయుధ వ్యక్తుల బృందం కాల్పులు జరిపినట్లు డాగేస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వ మీడియా ప్రకారం చర్చి మరియు ప్రార్థనా మందిరం రెండూ అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు ఏకకాలంలో, డాగేస్తాన్ రాజధాని మఖచ్కలలోని చర్చి మరియు ట్రాఫిక్ పోలీసు పోస్ట్‌పై దాడులు జరిగాయి. ఐదుగురు ముష్కరులను హతమార్చినట్లు యాంటీ టెర్రరిస్ట్ కమిటీ తెలిపింది. దాడులలో ఎంతమంది తీవ్రవాదులు పాల్గొన్నారనేది స్పష్టంగా తెలియలేదు. ఈ దాడులకు బాధ్యులమని వెంటనే ప్రకటించలేదు. ఉగ్రవాద చర్యకు పాల్పడ్డారనే ఆరోపణలపై అధికారులు క్రిమినల్ విచారణ ప్రారంభించారు. రష్యా జాతీయ తీవ్రవాద వ్యతిరేక కమిటీ వీటిని తీవ్రవాద చర్యలుగా అభివర్ణించింది.సాయుధ తిరుగుబాటు చరిత్ర కలిగిన ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతంలోఈ దాడులు జరిగాయని తెలిపింది. సోమ, మంగళ, బుధవారాలను ఆ ప్రాంతంలో సంతాప దినాలుగా ప్రకటించారు.

Exit mobile version
Skip to toolbar