Boat Sinks Off: మౌరిటానియా తీరంలో ఈ వారం వలసదారుల పడవ బోల్తా పడటంతో 89 మృతదేహాలను వెలికితీసినట్లు మత్స్యకార సంఘం అధిపతి తెలిపారు.పశ్చిమ ఆఫ్రికా తీరం నుండి కానరీ దీవులకు అట్లాంటిక్ వలస మార్గం. దీనిగుండా ఆఫ్రికన్ వలసదారులు స్పెయిన్ చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనది. వేసవి కాలంలో బాగా రద్దీగా ఉంటుంది.
170 మందితో కూడిన పడవలో యూరప్‌కు వెళ్తున్న 89 మంది వలసదారుల మృతదేహాలను కోస్ట్‌గార్డు స్వాధీనం చేసుకున్నట్లు మౌరిటానియా రాష్ట్ర వార్తా సంస్థ గురువారం తెలిపింది. ఐదేళ్ల బాలిక సహా తొమ్మిది మందిని రక్షించినట్లు పేర్కొంది. ఎన్‌డియాగోలోని మత్స్యకార సంఘం అధ్యక్షుడు యాలీ ఫాల్, శుక్రవారం మరణించిన వారి సంఖ్య 105 గా ఉందన్నారు. స్థానికులు తీరం నుండి వెలికితీసిన మృతదేహాలను పూడ్చిపెడుతున్నారని చెప్పారు. 2024 మొదటి ఐదు నెలల్లో కానరీ దీవులకు చేరుకోవడానికి ప్రయత్నించి 5,000 మంది వలసదారులు సముద్రంలో మరణించారని మైగ్రేషన్ రైట్స్ గ్రూప్ వాకింగ్ బోర్డర్స్ జూన్‌లో తెలిపింది.ఆ కాలంలో వలసదారుల సంఖ్య ఒక సంవత్సరం క్రితం కంటే ఐదు రెట్లు పెరిగి 16,500కి చేరుకుందని స్పానిష్ అంతర్గత మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది.