ship sinks off: 14 మంది సిబ్బందితో ఉప్పును తీసుకెళ్తున్న కార్గో షిప్ లెస్బోస్ ద్వీపంలో మునిగిపోవడంతో ఒకరు మరణించగా, 12 మంది తప్పిపోయినట్లు గ్రీక్ కోస్ట్ గార్డ్ తెలిపింది.కొమొరోస్-ఫ్లాగ్డ్ రాప్టర్ ఈజిప్ట్‌లోని ఎల్ దేఖీలా ఓడరేవు నుండి ఇస్తాంబుల్‌కు బయలుదేరి వెడుతుండగా ఈ దుర్ఘటన జరిగింది.
సిబ్బందిలో నలుగురు భారతీయులు కాగా ఎనిమిది మంది ఈజిప్షియన్లు మరియు ఇద్దరు సిరియన్లు ఉన్నారని కోస్ట్ గార్డ్ అధికారి వెల్లడించారు.ఒక వ్యక్తిని హెలికాప్టర్ ద్వారా రక్షించి ద్వీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. నలుగురు భారతీయులు సహా 12 మంది ఆచూకీ లేదు నవంబరు 26న ఉదయం 7 గంటలకు నౌకలో మెకానికల్ సమస్య ఉన్నట్లు నివేదించి, ప్రమాద సంకేతాన్ని పంపింది. కొంత సమయం తర్వాత లెస్బోస్‌కు నైరుతి దిశలో 8 కిమీ దూరంలో మునిగిపోయింది.
ఎనిమిది వర్తక నౌకలు, రెండు హెలికాప్టర్లు, ఒక గ్రీక్ నేవీ ఫ్రిగేట్ ప్రాణాలతో బయటపడినట్లు వెతుకుతున్నాయని కోస్ట్ గార్డ్ అధికార ప్రతినిధి తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో చాలా సమయం తర్వాత తీర రక్షక నౌకలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి.ఈ ప్రాంతంలో గంటకు 80 కిమీ (50 mph) వేగంతో వాయువ్య గాలులు వీస్తున్నాయని జాతీయ వాతావరణ సేవా విభాగం తెలిపింది.