Site icon Prime9

Acidity: ఎసిడిటిని ఇలా దూరం పెట్టండి

acidity prime9news

acidity prime9news

Acidity: మనలో చాలా మందికి గ్యాస్ సమస్యలు ఉన్నాయి. కొంత మందికి నిద్ర లేచిన వెంటనే గ్యాస్‌‌ సమస్య బాగా ఇబ్బంది పెడుతుంది. తలనొప్పి, మైగ్రెన్‌ ఉన్న వారికి ఈ సమస్య ఎక్కువుగా ఉంటుంది. ఎసిడిటీ వల్లే ఇలా అవుతుందని వైద్యులు చెబుతున్నారు. కడుపులో యాసిడ్‌ ఎక్కువైనప్పుడు ఎసిడిటీ కడుపులో నొప్పి, వికారం, అజీర్తి, ఛాతీలో మంటగా అనిపిస్తాయి. ఎసిడిటీ కారణంగా తీవ్రమైన తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. అసలు ఈ సమస్యలు వేటి వల్ల వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.

పిత్త దోషం ఉన్న వారికి హైపర్‌ ఎసిడిటీ, మైగ్రేన్ వంటి సమస్యలు వస్తాయి. ఎక్కువగా టీ, కాఫీలు తాగడం, నిద్ర సమస్యలు, ఊబకాయం, ఎక్కువగా మసాలాలు తినడం, జంక్‌ఫుడ్, ఆల్కహాల్‌, ఆందోళన చెందడం కారం ఎక్కువగా తినడం, కూల్‌ డ్రింక్స్‌ ఎక్కుగా తాగడం, ప్రయాణాలు ఎక్కువ చేయడం, రాత్రి సమయంలో ఫ్రైలు తినడం, మసాలా ఫుడ్స్ తినడం వల్ల ఎసిడిటీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్స్ మానేయండి. అప్పుడు ఎసిడిటీ కంట్రోల్ అవుతుంది.

మీకు పిత్త దోష సమస్యలు ఉంటే వెంటనే వైద్యుని సలహాలు తీసుకోండి. దీని కారణంగానే ఎసిడిటీ, మైగ్రేన్‌ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. వీటిని పాటించండి. మీ ఎసిడిటిని దూరం పెట్టండి. ఎసిడిటిని తగ్గించుకోవాలంటే నీటిని ఎక్కువుగా తీసుకోవాలి. బయట ఫుడ్స్ ను దూరం పెట్టాలి. రోజు ఉదయాన్నే వ్యాయామం చేయాలి. సమయానికి భోజనాన్ని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. మీ శరీర సమస్యకు కారణం ఏంటో తెలుసుకోండి. ఎసిడిటిని దూరం చేసుకోవడానికి ఇంగ్లీష్ మందులు ఒక్కటే కాదు. ఆయుర్వేద మందులు, హోమియోపతి మందులు కూడా వాడవచ్చు. హోమియోపతి మందులు వాడటం వలన ఒకసారి తగ్గితే మళ్ళి మన శరీరంలో వ్యాపించదు. హోమియోపతి మందుల్లో వ్యాధిని ఆవిరి చేయగలిగే గుణాలు ఉంటాయి.

Exit mobile version