Site icon Prime9

Vitamin D: విటమిన్ D లోపించిందా.. అయితే ప్రమాదమే

Vitamin D

Vitamin D

Vitamin D: మానవ శరీరంలో విటమిన్ ‘D’కీలక పాత్ర పోషిస్తుంది. సూర్యరశ్మి ద్వారా ఎక్కువగా లభించే ఈ పోషకం శరీరంలోని కాల్షియం, ఫాస్పేట్ లను క్రమబద్దీకరిస్తుంది. బలమైన కండరాలు, ఎముకలు, దంతాలకు విటమిన్ డీ ఎంతో అవసరం. శరీరంలో ఈ విటమిన్ లోపిస్తే అనేక వ్యాధులకు దారితీసినట్టే. మన దేశంలో విటమిన్ డి లోపంతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకి భారీగా పెరుగుతోంది. ప్రతి నలుగురిలో ముగ్గురు డి విటమిన్ లోపంతో బాధపడుతున్నట్టు తాజా అధ్యయనాల్లో తేలింది. ఈ లోపం వల్ల ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ , డిప్రెషన్‌, మధుమేహం, కీళ్ల వాతం లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

 

5 Amazing Benefits of Vitamin D - Today Every Latest World News

 

కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం

చిన్న పిల్లల్లో డి విటమిన్ లోపం రికెట్స్ అనే సమస్య తలెత్తుతుంది. దాని వల్ల ఎదిగే పిల్లల్లో, కాళ్లు వంకర అవ్వడం, పుర్రె సొట్టపడటం, ఎముకల తేలికగా విరగడం, ఎదుగుదలలో లోపాలు, కండరాలు, ఎముకలు నొప్పులు వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి.

అదే పెద్దవాళ్లలో అయితే కీళ్లు, కండరాలు, బలహీనమైన దంతాలు, రోగనిరోధక శక్తి తగ్గడం లాంటి అనేక సమస్యలు కలుగుతాయి. అలసట, నీరసం, ఒళ్లు నొప్పులు లాంటి సమస్యలు ఉన్నవారు డాక్టర్ ను సంప్రదించాలి. కనీసం రక్త పరీక్ష చేయించుకున్నా విటమిన్ డి స్థాయి ఎలా ఉందో తెలుస్తుంది. దాన్ని బట్టి టాబ్లెట్స్ రూపంలో గానీ, ఇంజెక్షన్ రూపంలో కానీ తీసుకోవాలి.

టైప్1, టైప్ 2 డయాబెటిస్ ను నివారించడానికి విటమిన్ డి సహాయపడుతుంది. అధిక రక్త పోటును తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడానికి విటమిన్ డి ల సహాయపడుతుంది. శరీరంలో తగినంత విటమిన్ డి ఉంటే.. మానసిన ప్రశాంతత కలిగి డిప్రెషన్ తగ్గుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని విటమిన్ డి తగ్గిస్తుంది.

 

Vitamin D doesn't prevent depression in older adults, large study finds ...

ఈ ఆహారంతో..

డి విటమిన్ లోపానికి ఆహారపు అలవాట్లు మారడం, ఇంట్లోనే ఎక్కువగా ఉండటం, ఎండలోకి వెళ్లకపోవడం లాంటివి ప్రధాన కారణాలు. కనీసం 6 నెలలు లేదంటే ఏడాదికి ఒక్కసారైనా విటమిన్ టెస్టులు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరానికి సూర్యరశ్మి తగిలేలా చూసుకోవడం, విటమిట్‌ డి ఎక్కువగా ఉండే గుడ్డు పచ్చసొన, చేపలు, మాంసాహారం, బలవర్ధకమైన తృణ ధాన్యాలు లాంటివి ఆహారంలో భాగంగా చేసుకోవాలని చెప్పారు.

మన దేశంలో శాకాహారులు ఎక్కువగా ఉండటం కూడా విటమిన్ డి లోపానికి కారణం. మరో వైపు సమతుల్య ఆహారం తీసుకున్నపుడు, అది సరిగా శరీరంలో అబ్జార్బ్ అయినప్పుడు మాత్రమే విటమిన్ డి ఉత్పత్తి సాధ్యపడుతుంది. కొన్ని రకాల శోషణ లోపాల వల్ల విటమిన్ డి లోపం ఉండే అవకాశం ఉంది. సెలియాక్ డిసీజ్, ఇన్ ప్లమేటరీ బవెల్ డీసీజ్, సిస్టిక్ ఫైబ్రోసిస్ మొదలైన సమస్యలు తలెత్తుతాయి.

పుట్టగొడుగులు వల్ల మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యానికి పుట్టగొడుగులు చాలా మంచివి. వీటిలో డి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. గోధుమలు, రాగి, బార్లీ, వోట్స్ లాంటి తృణధాన్యాల్లో విటమిన్ డి సమృద్దిగా లభిస్తుంది. పాలు, జున్ను, పెరుగు, ఇతర పాల ఉత్పత్తుల్లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. రోజూ వారి డైట్ లో వీటిని చేర్చుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ డి సమకూరుతుంది.

 

 

 

Exit mobile version
Skip to toolbar