Summer Cold: చాలామంది వేసవిలో కూడా వదలకుండా వేధించే దగ్గు, జలుబుల తో బాధపడుతుంటారు. దీనికి కారణం ఎంటిరో వైరస్. దగ్గు, తుమ్ముల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. అయితే ఇది నాలుగైదు రోజులు ఉండి వెళ్లి పోయే రకం కాదు. ఎక్కువ కాలం ఉంటుంది. అలాగని తీవ్రమైన లక్షణాలు ఉండవు. అడపాదడపా వేధించే దగ్గు, జలుబు రూపంలో కనిపించి.. లోలోపల ఎక్కువై శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌కు దారితీసేలా చేస్తుంది. మరి ఇలాంటి లక్షణాలతో బాధపడే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం.
3 రోజులు అంతకంటే ఎక్కువ(Summer Cold)
సాధారణంగా జలుబు, దగ్గులతో డాక్టర్లను కలిసేవాళ్లు చాలా తక్కువ. అయితే వేసవి వచ్చినా వదలకుండా ఉండే శ్వాసకోశ సమస్యలకు తప్పకుండా డాక్టర్లను సంప్రదించాలి. 3 రోజులు అంతకంటే ఎక్కువ రోజుల పాటు జలుబు తగ్గకుండా వేధిస్తూ ఉంటే మాత్రం కచ్చితంగా డాక్టర్‌ని కలవాలని చెబుతున్నారు.
ఈ వైరస్ కు వ్యాప్తి, తీవ్రతలను బట్టి ట్రీట్ మెంట్ ఇస్తారు. స్వల్ప ఇన్‌ఫెక్షన్లకు 5 రోజుల పాటు మందులు సూచిస్తారు. అప్పటికీ ఇన్‌ఫెక్షన్ అదుపులోకి రాకపోతే ఇతర పరీక్షలు చేసి వైరస్ కౌంట్, లక్షణం, తీవ్రత, ఇన్‌ఫెక్షన్ పరిణామాలను బట్టి మెరుగైప చికిత్సను అందిస్తారు.
శ్వాసకోశ సమస్యల ప్రారంభంలో ఫిజికల్ ఎగ్జామినేషన్, మెడికల్ హిస్టరీ తెలుసుకుని మాత్రమే 5 రోజుల పాటు మందులు వాడమని డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో మరిన్ని లోతైన పరీక్షలు కూడా అవసరం పడే అవకాశం ఉంది. వాటి ఫలితాల్ని బట్టి ఏ రకమైన యాంటీబయాటిక్స్ ఉపయోగించాలో క్లారిటీ వస్తుందంటున్నారు వైద్యులు.
చేయాల్సిన పరీక్షలేవంటే..(Summer Cold)
న్యుమోనియా తీవ్రత తెలుసుకోవడం కోసం చెస్ట్ ఎక్స్‌రే
వైరస్ రకం కోసం నాసల్ స్వాబ్
ఇన్‌ఫెక్షన్ వ్యాపించిన తీరు ఎలాంటిదో ‘థ్రోట్ స్వాబ్’ద్వారా తెలుస్తుంది
వైరస్ రకం తెలుసుకునేందుకు కల్చర్ పరీక్ష
జాగ్రత్తలు తప్పనిసరి
వైరస్ సోకినపుడు శారీరక విశ్రాంతి తీసుకోవాలి. చల్లని పదార్ధాలకు దూరంగా ఉండాలి. చల్లని వాతావరణంలో నుంచి వెంటనే వేడి వాతావరణంలోకి వెళ్లకూడదు. కాలుష్యం నుంచ రక్షణ కోసం మాస్క్‌లు, స్కార్ఫ్‌లు వాడాలి. తుమ్మినప్పుడు, దగ్గేనపుడు ముక్కుకు కర్చీఫ్ అడ్డు పెట్టుకోవాలి. ఎప్పుడూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. వేడి పదార్థాలే తీసుకోవాలి. వీలైనంత ఎక్కువగా గోరువెచ్చని నీళ్లు తాగుతుండటం శ్రేయస్కరం. ఉపశమనం కోసం వేడి నీటి ఆవిరి కూడా పట్టొచ్చు.