Onions: ఉల్లిపాయలను బిర్యానీలోనూ లేదా ఏదైనా నాన్ వెజ్ తిన్నప్పుడో నిమ్మకాయ పిండుకుని అలా పచ్చిగా తినడాన్ని ఎంజాయ్ చేస్తాం. మరికొందరేమో ఉల్లిపాయ పెరుగన్నంలో నంజుకోని తింటుంటారు. ఇంకొందరేమో పచ్చి ఉల్లిపాయపై నిమ్మరసం ఉప్పు పెప్పర్ వేసుకుని సైడ్ డిష్ గా తింటుంటారు. అయితే పచ్చి ఉల్లిపాయను నేరుగా తినేయడం ఇప్పటి జనరేషన్ కి అనేక తిప్పలు తెచ్చిపెడుతుందని ఆహార నిపుణులు చెప్తున్నారు. ఒకప్పుడు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదనే నానుడికి స్వస్తి పలుకుతూ ప్రస్తుతం ఉల్లిని పచ్చిగా తీసుకోకూడదని ఆరోగ్యానికి హానికరమని అంటున్నారు. అసలు పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం.
చక్కెర స్థాయి తగ్గుతుంది
పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల శరీరంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయట. అందుకే షుగర్ వ్యాధి ఉన్నవారు పచ్చి ఉల్లిపాయను తినకపోవడమే మంచిదని అంటున్నారు
ప్రేగుల మీద ప్రభావం
పచ్చి ఉల్లిపాయలను ఎక్కువగా తినడం వల్ల జీర్ణవ్యవస్థలో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా సమస్యలు వస్తాయి. ఈ సమస్యలో ప్రేగులపై ప్రభావం కనిపిస్తుంది. దీని కారణంగా జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
గర్భిణీలకు సమస్యలు
గర్భిణీలు పచ్చి ఉల్లిపాయలను తీసుకోకపోవడమే ఉత్తమం. వీటిని ఎక్కువగా తీసుకుంటే గుండె మంట, వాంతులు, వికారం వంటి సమస్య ఎక్కువగా ఉంటాయి.
మలబద్దకం
పచ్చి ఉల్లిపాయను ఎక్కువగా తీసుకుంటే కడుపునొప్పి, మలబద్ధకం వస్తుంది.
వాలిటోసిస్
పచ్చి ఉల్లిపాయ ముక్కలను ఎక్కువగా తింటే నోటి దుర్వాసన ఉంటుంది.
గుండెల్లో మంట
పచ్చి ఉల్లిపాయను ఆహారంగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట ఉంటుంది. ఉల్లిపాయలో ఉండే పొటాషియం కార్టియోలివర్ వ్యవస్థను దెబ్బతీస్తుంది.
ఉల్లిపాయలతో ప్రయోజనాలు..
ఉల్లిపాయలతో చాలా ప్రయోజనాలున్నాయి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కాకపోతే పచ్చిగా తినడం, ఉల్లిని అతిగా తినడమే శరీరాని మంచిది కాదని అంటున్నారు. మరి అంతే కదండి మంచి చేస్తుంది కదాని ఏదైనా అతిగా తింటే అదే కీడే చేస్తుంది.