Site icon Prime9

Sensodyne Tooth Paste : భారత దంతవైద్య సంఘముతో భాగస్వామ్యం కుదుర్చుకున్న సెన్సొడైన్..

sensodyne tooth paste deal with indian dental association

sensodyne tooth paste deal with indian dental association

Sensodyne Tooth Paste : ప్రపంచ దంతవైద్యుల దినోత్సవం రోజున దంతవైద్యుల దోహదానికి గౌరవ సూచకంగా సెన్సొడైన్ భారత దంతవైద్య సంఘముతో భాగస్వామ్యం కుదుర్చుకొంది
నోటి ఆరోగ్యం యొక్క పురోగతిలో నగరంలోని అగ్రస్థాయి దంతవైద్యుల దోహదమును గుర్తించడం ద్వారా వారు చేసిన కృషిపై వెలుగు ప్రసరించాలని ఐడిఏ మహాసభ లక్ష్యంగా చేసుకొంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హేలియన్ (మునుపటి గ్లాక్సోస్మిత్‌క్లైన్ కన్స్యూమర్ హెల్త్ కేర్) నుండి ఒక అగ్రగామి నోటి సంరక్షణ బ్రాండ్ అయిన సెన్సొడైన్, అక్టోబర్ 03 వ తేదీన ప్రపంచ దంత వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా తమ రోగుల మంచి నోటి సంరక్షణను చూసుకోవడంలో దంతవైద్యుల పాత్రను గుర్తించి మరియు సంబరం జరుపుకోవడానికి గాను భారత దంతవైద్య సంఘము (ఐడిఏ)తో భాగస్వామ్యం కుదుర్చుకొంది. దంతవైద్యుల సమాజములో ఈ నోటి ఆరోగ్య నిపుణుల పాత్రను గౌరవించడానికి గాను సెన్సొడైన్ మరియు ఐడిఏ, సర్వశ్రేష్టమైన రోగి ఫలితాల దిశగా పని చేయడానికి వారికి వీలు కలిగించేలా దంతవైద్య శాస్త్రములో అత్యాధునిక అంశాలను చర్చించడానికి దంతవైద్యుల కొరకు తనదైన-శైలి లోని ఒక వేదికను సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. దంతవైద్య రంగానికి సీనియర్ దంతవైద్యులు చేసిన విశేష దోహద సహకారాల కొరకు వారిని సన్మానించడానికి కూడా ఈ వేదిక ఉపయోగించుకోబడింది.

ఈ చొరవలో భాగంగా, అనేక నగరాల వ్యాప్తంగా పలు సమావేశాలకు ఆతిథ్యవ్వడం జరుగుతోంది. ఈ మహాసభలో పాల్గొన్నవారు ముఖ్య నోటిసంరక్షణ సమస్యలు, ముందస్తు ఆరోగ్య సంరక్షణ కొరకు అవసరము మరియు వారు చేపట్టిన కేసులలో అత్యంత సమస్యాత్మకమైన కొన్నింటి గురించి చర్చించారు. సాధారణ సమస్యలను గుర్తించడానికి మరియు వినూత్నమైన పరిష్కారాలను అన్వేషించడానికి ఇది సహాయపడింది.

గడచిన 31 సంవత్సరాలుగా దంతవైద్యరంగానికి తాను అందించిన విశేష సహాయ సహకారాలకు గాను డా. జి. చంద్రశేఖర్, ఎండిఎస్ మరియు ఆర్థోడెంటిస్ట్ గారిని ఈ వేడుక సందర్భంగా సత్కరించడం జరిగింది. అతను 2016 నుండి 2017 వరకు భారతీయ ఆర్థోడోంటిక్ సొసైటీకి మునుపటి అధ్యక్షులుగా, 1992 లో ఆంధ్రప్రదేశ్ ఐడిఏ సెక్రెటరీగా, మరియు ఐడిఏ యొక్క దక్కన్ శాఖకు రెండుసార్లు అధ్యక్షులుగా పని చేశారు. ఈ వేడుకకు హాజరైన ఇతర సీనియర్ దంతవైద్యులు: డా. పి. కరుణాకర్, ప్రిన్సిపాల్, పాణినీయ కాలేజ్; డా. కె.వి. రమణా రెడ్డి, ప్రిన్సిపాల్, మల్లారెడ్డి కాలేజ్; డా. ఆదిత్య సందీప్, ఎండిఎస్; డా. శ్రీలంకాంత్, ఎండిఎస్ మరియు డా. వై.ఎస్. రెడ్డి, ఎండిఎస్.

ఈ భాగస్వామ్యముపై తన ఆలోచనల్ని వ్యక్తీకరిస్తూ, హేలియాన్, భారత ఉపఖండం, హెడ్ ఆఫ్ మార్కెటింగ్ శ్రీమతి అనురితా చోప్రా గారు, ఇలా అన్నారు, “మన సమగ్ర ఆరోగ్యానికీ నోటి ఆరోగ్యాన్ని కీలకమైన భాగంగా చేస్తూ మన మొత్తం శరీరానికి మన నోరు ముఖద్వారంగా ఉంది. మన జీవితాలలో దంతవైద్యుల పాత్ర కేవలం దీర్ఘ-కాలిక ఆరోగ్యాన్ని నిర్వహించుకోవడానికి మాత్రమే కాదు, అయితే సాధ్యమైన చిన్న చిన్న ఆనందాలకు వీలు కల్పించడానికి కూడా ఎంతో కీలకమైనది, వారు అందించే మంచి నోటి సంరక్షణ పట్ల ధన్యవాదాలు. ఈ ప్రపంచ దంతవైద్యుల దినోత్సవం రోజున భారతీయ దంతవైద్యుల సంఘముతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం పట్ల మేము గౌరవించబడ్డాము మరియు దంతవైద్యుల అమూల్యమైన దోహదానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. క్రమం తప్పకుండా దంతవైద్య అపాయింట్‌మెంట్ల అవసరంపై అవగాహన కల్పించాలని మేము ఆశిస్తున్నాము, తద్వారా ప్రజలు తమ నోటి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ అందరికీ ఆరోగ్యవంతమైన భవిష్యత్తును అందించేలా ప్రేరణ కలిగించబడుతుంది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారతీయ దంతవైద్య సంఘం గౌరవ సెక్రెటరీ జనరల్ డా. అశోక్ ధోబ్లే గారు ఇలా అన్నారు “ఇండియాలో నోటి సంరక్షణ గురించి అవగాహనను పెంపొందించడానికి ఐడిఏ కట్టుబడి ఉంది. నోటి సంరక్షణ పట్ల మా మనోభావనను ‘నయం చేయు చికిత్స నుండి నివారణాత్మక’ చికిత్సకు మళ్ళించాల్సి ఉంది. నోటి సంరక్షణ రంగానికి గౌరవనీయులైన మా దంతవైద్యులు చేసిన విశేష కృషి మరియు సహకార దోహదాలను గుర్తించే దిశగా ఈ మహాసభ ఒక ముందడుగు అవుతుంది. భారతీయుల నోటి సంరక్షణ పట్ల శ్రద్ధ తీసుకోవడం ద్వారా వారికి సేవ చేయడానికి ఇది హేలియాన్ మరియు ఐడిఏ ఉభయుల నిబద్ధతకు ఒక తార్కాణము అని కొనియాడారు.

Exit mobile version