Over Weight: ఉదయం చేసే ఈ తప్పులు.. అధిక బరువుకు కారణం కావచ్చు

Over Weight: చాలామంది బరువు తగ్గాలంటే ఎక్సర్ సైజులు చేయాలి. తక్కువ ఆహారం తీసుకోవాలి అనుకుంటారు. కానీ మారుతున్న లైఫ్ స్టయిల్ మార్పులను మాత్రం పట్టించుకోరు. అయితే ఆ మార్పులను అనుసరిస్తేనే మంచి ఫలితం ఉంటుంది. ఈ క్రమంలో ఉదయాన్నే చేసే అలవాట్లు కూడా మన అధిక బరువుకు కారణం అవుతూ ఉంటాయి. మరి అలవాట్లను మార్చుకోవాలంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు..

 

అధిక బరువుకు కారణమయ్యే..(Over Weight)

రోజు మొదలవ్వడానికి అత్యంత ముఖ్యపాత్ర పోషించేది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌. దీన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా మానేయకుండా ప్రయత్నించాలి. ఉదయం ఉపవాసంతో మొదలుపెడితే.. మధ్యాహ్నం ఆకలితో అవసరానికి మించి ఎక్కువ ఆహారం తిసుకుంటాం. ఈ పద్దతి అనారోగ్యానికి దారి తీస్తుంది. అదే విధంగా అధిక బరువుకు కారణమవుతుంది. కాబట్టి తగినన్ని పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు ఉండే బలవర్థకమైన బ్రేక్‌ ఫాస్ట్ తో రోజును మొదలుపెట్టడం ఉత్తమం.

శరీరానికి సరిపడా నిద్ర లేకపోతే బరువు పెరుగుతామనే విషయం తెలిసిందే. అయితే అదే నిద్ర ఎక్కువగా ఉన్నా సేమ్ రిజల్ట్ వస్తుంది. రోజుకు 10 గంటలు నిద్రపోయే వ్యక్తుల్లో బీఎమ్ఐ పెరిగిపోయే అవకాశాలున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. కాబట్టి రాత్రి వీలైనంత త్వరగా నిద్ర పోయి.. వీలైనంత త్వరగా నిద్ర లేచేందుకు ప్రయత్నించాలి.

 

నిద్ర సరిగా పట్టాలంటే పడక గదిలోకి సహజమైన వెలుతురు పడేలా చూసుకోవాలి. కిటికీలు, కర్టెన్లు మూసి ఉంచితే సూర్యరశ్మి పడదు. తద్వారా చీకట్లో నిద్ర లేవడం వల్ల శరీరం బద్దకాన్ని వదిలించుకోలేదు. ప్రకృతి సిద్ధమైన ప్రయోజనాలను అందుకోలేదు. శరీర క్రమ పద్ధతిలో నడుచుకోవాలంటే నిద్ర లేచిన వెంటనే సూర్యరశ్మి సోకనివ్వాలి.

 

 

రాత్రి పడుకునే ముందు, ఉదయం నిద్ర లేచిన వెంటనే దుప్పట్లు మడత పెట్టడం, దిండ్లు, పరుపును సర్దుకునే అలవాటు అలవాటు చేసుకోవడం ఉత్తమం. ఇలాంటి అలవాటు వల్ల రాత్రి పడుకోగానే నిద్ర ముంచుకొస్తుంది. దీంతో నిద్రలేమి సమస్య తగ్గుతుంది. అదే విధంగా ఒక క్రమశిక్షణ అలవాటై, రోజూ ఒకేవేళకు నిద్ర వస్తుంది. ఉదయం హుషారుగా మేలుకో గలుగుతాం.