Monsoon Skin Care Tips: ఈ మధ్య కాలంలో అమ్మాయిలే కాదండోయ్ అబ్బాయిలు కూడా అందంపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. అందులోనూ యువత అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందంగా కనిపించడం కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు కానీ సీజన్లు తగినట్టు కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. అయితే వర్షాకాలం వచ్చేసంది. మరి వర్షాలంలోనూ ముఖాన్ని అందంగా ఉండేలా ఎలా చూసుకోవాలి.. ఈ వర్షాకాలంలో మొటిమలు, దద్దుర్లు, ఇతర చర్మ సమస్యలు రాకుండా ఎలా చూసుకోవాలో ఓ సారి తెలుసుకుందాం.
తేమ వాతావరణం, ఆపై కాలుష్యం కారణంగా ముఖంపై దద్దుర్లు మొటిమలు రావడం సహజం. దీన్ని నివారించడానికి సరైన చర్మ సంరక్షణ అవసరం. మరి చిన్ని చిట్కాలతో సుందరంగా ఎలా కనిపించాలో ఓ సారి చూసేద్దాం.
మాయిశ్చరైజర్: వాతావరణం చాలా తేమగా ఉన్నప్పటికీ మీరు మాయిశ్చరైజర్‌ని ఉపయోగించవచ్చు. వర్షాకాలంలో మీరు తేలికపాటి మాయిశ్చరైజర్‌ను ఉపయోగించడం ద్వారా మొఖంపై జిడ్డును తొలగించి, హైడ్రేట్ చేస్తుంది.
సన్‌స్క్రీన్: ఎండాకాలంలోనే కాదు ఏ కాలంలోనైనా సన్‌స్క్రీన్‌ని అప్లై చేయండి. వర్షాకాలంలోనూ సన్‌స్క్రీన్ అప్లై చేసి మీ చర్మం నల్లబడకుండా కాపాడుకోండి.
టోనర్: చర్మాన్ని లోతుగా శుభ్రపరచడంలో టోనర్ ఉపయోగిపడుతుంది. ఇది pHని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది.
క్లెన్సర్: ముఖాన్ని శుభ్రపరచడంలో తేలికపాటి క్లెన్సర్ ఉపయోగపడుతుంది. ఈ రొటీన్ మీ ముఖం గ్లోను పెంచుతుంది.
జుట్టును శుభ్రంగా ఉంచండి: జిడ్డుగల జుట్టు చర్మంపై దద్దురులకు దారితీస్తుంది. కాబట్టి మీ జుట్టును రోజూ కడగాలి.
మేకప్: వర్షాకాలంలో మీ మేకప్‌ను చాలా తేలికగా ఉంచండి. తక్కువ వేయడానికి ప్రయత్నించండి. భారీ ఫౌండేషన్ వేయడం వలన చర్మంపై నూనె గ్రంథులు మూసుకుపోతాయి. ఫలితంగా మొటిమలు వస్తాయి. కాబట్టి తేలికపాటి మేకప్ వేసుకోండి, అలాగే రాత్రి పడుకునే ముందు మేకప్‌ను కడిగేసుకోండి.
ఆరోగ్యకరమైన ఆహారం: వర్షాకాలంలో మీరు తినే ఆహారం విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఊరగాయ పచ్చళ్లు, ఆయిల్ ఫుడ్ తినడం మానుకోండి. ఇవి మొటిమలను పెంచుతాయి. పండ్లు, కూరగాయలు, పప్పులను ఎక్కువ తినండి.