Liver Health: మీ కాలేయం ఆరోగ్యంగా ఉందా..?

శరీరంలోని అన్ని సక్రమంగా విధులు నిర్వర్తించాలంటే కాలేయం ఆరోగ్యంగా ఉండాలి. అయితే ప్రస్తుత జీవన శైలి, ఆల్కహాల్ వాడకం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం లాంటివి తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి.

Liver Health: మూడు రోజుల క్రితం ప్రముఖ మలయాళ నటి సుబీ సురేష్ కాలేయ సంబంధిత వ్యాధితో భాదపడుతూ ప్రాణాలు విడిచింది. అతి చిన్న వయసులో ఆమె ప్రాణాలు కోల్పోవడం బాధాకరమైన విషయం. తన జీవన శైలి లో మార్పుల వల్ల తీవ్ర అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నట్టు గతంలో ఆమె పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. సమయానికి తినలేకపోవడం, ఇతరత్రా ఆరోగ్య కారణాల వల్ల మందులు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ఆఖరికి కాలేయ దెబ్బతినడం వల్ల ఆమె మృతి చెందింది.

మంచి ఆహారం చాలా ముఖ్యం(Liver Health)

మానవ శరీరంలో అతిపెద్ద రెండో అవయవం కాలేయం. శరీరంలోని అన్ని సక్రమంగా విధులు నిర్వర్తించాలంటే కాలేయం ఆరోగ్యంగా ఉండాలి.

అయితే ప్రస్తుత జీవన శైలి, ఆల్కహాల్ వాడకం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం లాంటివి తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి.

కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సమయానికి మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

శరీర అవసరాలకు కావాల్సిన ప్రొటీన్లు, కొలెస్ట్రాల్, విటమిన్స్, ఖనిజాలు , పిండిపదార్థాలను కూడా ముఖ్యమైన విధుల్లో నిల్వ చేయడానికి కాలేయం అవసరం.

ఆల్కహాల్, డ్రగ్స్, జీవక్రియ మలినాల వంటి విషాలను సహజంగా తొలగిస్తుంది.

అందుకే రోజూవారీ ఆహారంలో ఉప్పును మితంగా తీసుకోవాలి. ఎందుకంటే అదనపు ఉప్పు కడుపులో నీటి పరిమాణాన్ని పెంచుతుంది. దాని వల్ల శీరరంలో మంట సమస్య అధికంగా ఉంటుంది.

నిమ్మకాయలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. నిమ్మను తీసుకోవడం వల్ల కాలేయం నుంచి కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే మరెన్నో ఆహార పదార్థాలు కూడా మన కాలేయం ఆరోగ్యాన్ని కాపాడతాయి.

బీట్‌రూట్ రసం కాలేయం ఎంజైమ్‌లనుపెంచడానికి బీట్ రూట్ రసం ఉపయోగపడుతుంది. కాలేయ వాపు నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.

ద్రాక్ష, ద్రాక్ష గింజల సారం యాంటీఆక్సిడెంట్ స్థాయిలను పెంచి, అవి కాలేయాన్ని హాని నుంచి రక్షిస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

అలాగే ఇది శరీరంలో మంటను తగ్గిస్తుందని తేలింది. మంటను తగ్గించడం దాని రక్షణ వ్యవస్థలను పెంచడం ద్వారా, ద్రాక్షపండు యాంటీఆక్సిడెంట్ కాలేయాన్ని కాపాడుతుంది.

బ్లాక్, గ్రీన్ టీ తాగడం ద్వారా కాలేయం ఎంజైమ్, లిపిడ్ స్థాయిలు మెరుగుపడతాయి. అయితే, గ్రీన్ టీని తీసుకుంటే అది అందరికీ పడకపోవచ్చు.. కాబట్టి జాగ్రత్తలు తీసుకుని వాడటం మంచిది.

 

కాలేయంపై ప్రతికూల ప్రభావాలు

కాలేయంలో యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలను పెంచడంతో పాటు, వాపును తగ్గించడంలో కాఫీ బాగా ఉపయోగపడుతుంది.

అదనంగా, ఇది కాన్సర్, కొవ్వు కాలేయం, కాలేయ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని రీసెర్చ్ లు చెబుతున్నాయి.

కాలేయంపై పేరుకుపోయిన కొవ్వును తొలగించడంలో యాపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగపడుతుంది. ఖాళీ కడుపుతో యాపిల్ తినడం వల్ల శరీరంలోని కొవ్వును తొలగించుకోవచ్చు.

కొవ్వు ఎక్కువగా తీసుకోవడం, కార్బోహైడ్రెట్స్ తీసుకోవడం.. వాటికి తగ్గట్టు విటమిన్స్ తీసుకోకపోవడం.. ఇన్సులిన్ నిరోధకత కాలేయంపై ప్రతికూల ప్రభావాలను చూపెడుతుందని అధ్యయనాలు వెల్లడించాయి.

నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ బారిన పడకుండా ఉండాలంటే పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని నిపుణలు చెబుతున్నారు.

 

నోట్: పలు పరిశోధనలు, హెల్త్ జనరల్స్, అధ్యయనాలు నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగా ఒక అవగాహన కోసం ఈ వార్తలను అందించాం. ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పనిసరిగా సంబంధిత డాక్టర్ సూచనలు తీసుకోవాలి. ఈ వార్తలో అందించిన సమాచారానికి ‘ప్రైమ్9 న్యూస్’ఎలాంటి బాధ్యత వహిందని తెలియజేస్తున్నాం.