Site icon Prime9

Kidney Stones: కిడ్నీలో రాళ్లు రాకుండా ఈ సహజ పద్థతులను ఫాలో అవ్వండి

kidney stones

kidney stones

Kidney Stones: ఈ కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య కిడ్నీ లో రాళ్లు. ఈ సమస్య వస్తే ఒకసారితో పోయేది కాదు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్లీ మళ్లీ ఈ సమస్యను వస్తూ ఉంటుంది. అలాగని కిడ్నీ రాళ్ల నుంచి విముక్తి పొందడం పెద్ద కష్టమేమి కాదు. యూరిన్ లోని కొన్ని రసాయనాలు బయటకు పోకుండా పేరుకుపోవడం వల్ల కిడ్నీలో రాళ్లు తలెత్తుతాయి.

ఇవి మూత్ర మార్గంలో ఇరుక్కుపోయి మంట, నొప్పి, సరిగా యూరిన్ రాకపోవడం లాంటివి వేధిస్తుంటాయి. అదే విధంగా మన శరీరం ప్రోటీన్ వినియోగించుకునే క్రమంలో వెలువడే యూరిక్ ఆమ్లంతోనూ రాళ్లు ఏర్పడతాయి. మరి ఈ సమస్యను నివారించుకోవాలంటే.. కిడ్నీలో రాళ్లు రాకుండా చూసుకోవటమే మార్గం. అందుకు కొన్ని చిట్కాలు..

సిట్రిక్ యాసిడ్ తో

నీరు ఎక్కువగా తాగటం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి దారితీసే పదార్థాలు పలుచగా మారుతాయి. దీంతో ఇవి యూరిన్ తో పాటు తేలికగా బయటకు వచ్చేస్తాయి.

కాబట్టి రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్లు నీరు తాగాలి. నిమ్మరసం కలిపిన నీరు, ఆరెంజ్ రసం లాంటివి తీసుకున్నా మంచిదే. సిట్రిక్ యాసిడ్ ఉన్న పండ్లు రాళ్లు ఏర్పడకుండా కాపాడతాయి.

శరీరానికి కావాల్సినంత క్యాల్షియం తీసుకోకపోతే మూత్రంలో ఆక్జలేట్ స్థాయిలు పెరిగి రాళ్లు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వయసుకు తగినట్టుగా క్యాల్షియం తీసుకునేలా చూసుకోవాలి.

అది కూడా సహజంగా ఆహారంగా వచ్చేలా చూసుకుంటే మరీ మంచిది.

ఎందుకంటే క్యాల్షియం టాబ్లెట్ వల్ల కిడ్నీ లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది కొన్ని అధ్యయనాలు తేల్చాయి.

కాబట్టి మంచి ఆహారం తీసుకోవడమే ఉత్తమం. 50 ఏళ్లు నిండిన మగవారికి రోజుకు 1000 మిల్లీ గ్రాముల క్యాల్షియం అవసరమవుతుంది. అదే విధంగా విటమిన్ డి కూడా అందేలా చూసుకోవాలి.

ఎందుకంటే అది క్యాల్షియాన్ని శరీరం గ్రహించుకోవడంలో ఉపయోగపడుతుంది.

పరిమితంగా ఉప్పు(Kidney Stones)

సోడియం అధికంగా తీసుకుంటే యూరిన్ లో క్యాల్షియం స్థాయిలు పెరిగేలా చేస్తుంది. కాబట్టి ఉప్పు పరిమితంగానే తీసుకోవాలి. రోజుకు 2,300 మిల్లీ గ్రాముల ఉప్పు తీసుకోవచ్చు.

ఉప్పుతో కిడ్నీ రాళ్లు ఏర్పడే స్వభావం ఉన్న వారైతే రోజుకు 1,500 మిల్లీ గ్రాములకు మించకుండా చూసుకోవాలి. ఇది రక్తపోటు తగ్గటానికి, గుండె ఆరోగ్యానికీ మేలు చేస్తుంది.

మాంసం, చికెన్‌, గుడ్లు, సముద్ర రొయ్యలు, చేపల వంటివి ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఎక్కువగా ప్రోటీన్‌ లభిస్తుంది.

కానీ అది మూత్రంలో యూరిక్‌ ఆమ్లం మోతాదులు పెరిగేలా చేసి కిడ్నీ రాళ్లు వచ్చేలా చేస్తాయి.

ప్రోటీన్‌ను మరీ ఎక్కువగా తీసుకుంటే రాళ్లు ఏర్పడకుండా చూసే సిట్రేట్‌ స్థాయిలు కూడా పడిపోతాయి. కాబట్టి మాంసాహారం తక్కువగా తీసుకోవటం మంచిది.

 

 

ఆక్జలేట్‌ పదార్ధాలకు దూరంగా

పాలకూర, తేయాకు, గింజ పప్పులు, బీట్‌రూట్‌, చాక్లెట్‌ లాంటి వాటిల్లో ఆక్జలేట్‌ అధికంగా ఉంటుంది. అదే విధంగా కూల్ డ్రింక్స్ లో ఫాస్ఫేట్‌ ఎక్కువ ఉంటుంది.

ఇవి రెండూ కిడ్నీ రాళ్లకు దారితీసేవే. అందువల్ల కిడ్నీ రాళ్లతో బాధపడేవాళ్లు వీటికి దూరంగా ఉండటమే మేలు.

అరకప్పు పెరుగులో చెంచా నిమ్మరసం, అరస్పూను ఉప్పు వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

తులసి ఆకుల రసాన్ని తీసి దానికి ఒక చెంచా తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

 

నోట్: పలు పరిశోధనలు, హెల్త్ జనరల్స్, అధ్యయనాలు నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగా ఒక అవగాహన కోసం ఈ వార్తను అందించాం. ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పనిసరిగా సంబంధిత డాక్టర్ సూచనలు తీసుకోవాలి. ఈ వార్తలో అందించిన సమాచారానికి  ‘ప్రైమ్9 న్యూస్’ ఎలాంటి బాధ్యత వహిందని తెలియజేస్తున్నాం.

 

Exit mobile version