Honey Uses: తేనెను ఎప్పుడు.. ఎలా తీసుకోవాలో తెలుసా?

రోగనిరోధక శక్తిని పెంచడానికి తేనె చాలా బాగా ఉపయోగపడుతుంది. శరీరంలోని హానికరమైన బ్యాక్టిరియాను అడ్డుకునే గుణం తేనెలో ఉంటుంది.

Honey Uses: రోగనిరోధక శక్తిని పెంచడానికి తేనె చాలా బాగా ఉపయోగపడుతుంది. శరీరంలోని హానికరమైన బ్యాక్టిరియాను అడ్డుకునే గుణం తేనెలో ఉంటుంది. శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలిగించే తేనె దాదాపుగా అందరి ఇళ్లలోనూ ఉంటుంది. తేనెను శుద్ది చేసేటపుడు అందులో ఉండే పుప్కొడి దెబ్బతింటుంది. కానీ, ఎక్కువగా పోషకాలు ఉండేది మాత్రం ఆ పుప్పొడిలోనే. కాబట్టి ముడి తేనెను వాడటం ఉత్తమం. అయితే తేనెను ఎప్పుడు ఎలా తీసుకోవాలో అనేది ముఖ్యం.

 

యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ(Honey Uses)

తేనెలో క్యాల్షియం, ఐరన్, సోడియం, ఫాస్ఫరస్, సల్ఫర్, పోటాషియం లాంటి ఖనిజ లవణాలతో పాటు విటమిన్ సి, విటిమిన్ బి వంటి విటమిన్లు, ప్రొటీన్లు కూడా ఉంటాయి. అంతేకాకుండా ముదురు రంగు తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు కాస్త ఎక్కువగా ఉంటాయి.

తేనె తీసుకునే విధానాన్ని బట్టి వివిధ రకాలుగా మన శరీరంపై ప్రభావం చూపుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో స్పూన్ తేనె, సగం చెక్క నిమ్మరసం కలిపి పరగడుపున తాగితే మలబద్ధకం సమస్య, ఛాతీ మంట తగ్గుతాయి.

మంచి నిద్ర కోసం పడుకునే ముందు ఒక స్పూన్ తేనె తీసుకోవాలి. అది మెదడును, శరీరాన్ని గాఢనిద్రలోకి తీసుకెళ్తుంది. అంతే కాకుండా రాత్రి సమయంలో తేనె తీసుకోవటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.

బరువు తగ్గాలనుకునే వాళ్లు ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లల్లో రెండు స్పూన్ల తేనె, స్పూన్ నిమ్మరసం వేసుకొని తాగాలి. దీని వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడి, పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది.

 

పిల్లల్లో దగ్గు తగ్గించేందుకు

గ్లాసు గోరువెచ్చని నీళ్లలో రెండు స్పూన్ల తేనె, ఒక స్పూన్ నిమ్మరసం కలిపి పరగడుపున పిల్లలకు ఇస్తే మంచిది. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పిల్లల్లో తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు యాంటీ బ్యాక్టీరియల్‌గా పనిచేస్తాయి. పిల్లల్లో దగ్గు ఎక్కువ వస్తున్నా తమలపాకు మీద కొంచెం తేనె వేసి తినిపిస్తే అదుపులోకి వస్తుంది.

రాత్రి సమయంలో ఒక గ్లాసు నీళ్లలో స్పూన్ తేనె వేసుకొని తాగాలి. దీంతో ఒత్తిడిని తగ్గించి మెదడు డిప్రెషన్‌కి గురి కాకుండా ఆపుతుంది.

రెండు స్పూన్ల యాపిల్ సిడారఖ్ వెనిగర్ కి ఒక స్పూన్ చొప్పున తేనె కలిపి తాగితే, సైనస్ అదుపులో ఉంటుందని పలు అధ్యయానాలు తేల్చాయి.

తేనె, రోజ్ వాటర్ కలిపి తీసుకుంటే వ్యాధినిరోధక గుఱాలు మచ్చలను దూరం చేస్తాయి. రోజ్ వాటర్ చర్మంలోని పీహెచ్ స్థాయిలను సమన్వయం చేసి ఫ్రెష్ గా ఉంచుతుంది.

సహజసిద్ధమైన పెదవుల కావాలంటే తేనెలో చక్కెర కలిపి సున్నితంగా రుద్దితే మంచి రిజల్ట్ ఉంటుంది. పెదవులపై మృతకణాలు తొలిగిపోతాయి.

మద్యం తాగిన తర్వాత వచ్చే తలనొప్పికి తేనె బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని ఫ్రక్టోజ్ అనే న్యాచురల్ చక్కెర కాలేయం, మద్యాన్ని త్వరగా విడగొట్టేలా చేస్తుంది.